Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల.. నేడు చంద్రబాబుకు రేవంత్ : ఎల్. రమణ

ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:37 IST)

Widgets Magazine
l ramana

నాడు స్వర్గీయ ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిస్తే ఇపుడు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహం చేశారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. 
 
తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరవొచ్చన్న సంకేతాలు వినొస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఎల్. రమణ ఆదివారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వేళ, ఆనాడు ఎన్టీఆర్‌కు నాదెండ్ల వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీకి మరో నాదెండ్లలా తయారయ్యారన్నారు. 
 
ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న వేళ, ఢిల్లీకి వెళ్లి, రాహుల్ గాంధీతో చర్చలు జరిపి, నమ్మి పదవులిచ్చిన అధినేతకు ఆయన వెన్నుపోటు పొడిచి అభినవ నాదెండ్లగా మారారని దుయ్యబట్టారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఆయన చూస్తున్నారని, అది జరిగే పది కాదని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేవంత్ రెడ్డి రాజీనామాతో నల్గొండ టీడీపీ ఖాళీ...

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రేవంత్ ...

news

పన్నీర్ సెల్వం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసొచ్చారట...

ఓ తమిళ మంత్రి తెలివితేటలు బయటపడ్డాయి. దిండుగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ...

news

కార్యకర్తలతో మాట్లాడి మీ ముందుకు వస్తా.. అర్థం చేసుకోండి: రేవంత్

తన వర్గానికి చెందిన కార్యకర్తలతో మాట్లాడి మీ ముందుకు వస్తానని, అంతవరకు తననేమీ అడగవొద్దని ...

news

ఆరేళ్ల బుడతడు... పైలట్‌గా విమానం నడిపాడు (వీడియో)

ఆ బుడతడి వయసు ఆరేళ్లు. కానీ, అలవోకగా విమానం నడిపాడు. పేరు అదామ్. అబుదాబి వాసి. చిన్నప్పటి ...

Widgets Magazine