Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అంతా వెంకయ్య మాయ: తెలంగాణలో 12వరకు తెలుగు తప్పనిసరి: కేసీఆర్ కీలక నిర్ణయం

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (15:54 IST)

Widgets Magazine

తెలంగాణలోని అన్నిరకాల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఓ పాఠ్యాంశంగా బోధించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ తెలుగు భాషా పరిరక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో నిర్వహించే అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బోర్డులను కచ్చితంగా తెలుగులోనే రాయాలన్నారు. 
 
తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే నిమిత్తం సీఎం రెండు కీలక నిర్ణయాలను ప్రకటించారు. మహాసభల నిర్వహణకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాల ద్వారా తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో ఇకపై అనుమతి లభించనుంది.
 
ఉర్దూ కోరుకునే విద్యార్థులకు ఉర్థూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండొచ్చునని కేసీఆర్ పేర్కొన్నారు. సిలబస్ రూపకల్పనకు తర్వాత పుస్తకాల ముద్రించాలన్నారు. సాహిత్య అకాడమీ రూపొందించిన ఈ సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలన్నారు. 
 
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్‌ వరకు తెలుగు భాషాబోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంకయ్య ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ను ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని, తద్వారా మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డేరా బాబా ఒత్తిడి వల్లే అది చేశా.. బాబాకు లొంగని వాళ్లను కుర్చీకి కట్టేసి?

రేపిస్ట్ గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్వ‌ప్న చౌధురి అనే ఓ ...

news

మహిళపై పదిమంది గ్యాంగ్ రేప్.. ఇద్దరు మైనర్లు కూడా.. హింసించి.. 15గంటలు?

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మైనర్లతో పాటు పదిమంది దారుణంగా ...

news

ప్రొఫెసర్ ఐలయ్య ఓ సైకో - ఆర్యవైశ్యులు.. చంద్రబాబు సీరియస్

ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

news

డొమినోస్ పిజ్జా ఓరెగాన్ ప్యాకెట్లలో పురుగులు... వీడియో చూడండి

డోమినోస్ పిజ్జా సంస్థ చిక్కుల్లో ఇరుక్కుంది. తాను ఆర్డ‌ర్ చేసిన పిజ్జా సీజ‌నింగ్ ...

Widgets Magazine