శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: బుధవారం, 8 నవంబరు 2017 (18:12 IST)

రాహుల్ గాంధీలో ఆ ఒక్కటి నాకు బాగా నచ్చింది... రాములమ్మ

సినిమా నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎంపిగా పనిచేసిన అనుభవం ఉండటమే కాకుండా రెండు, మూడు పార్టీలు మారి చివరకు సొంత పార్టీ పెట్టి ఆ తరువాత చతికిల

సినిమా నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎంపిగా పనిచేసిన అనుభవం ఉండటమే కాకుండా రెండు, మూడు పార్టీలు మారి చివరకు సొంత పార్టీ పెట్టి ఆ తరువాత చతికిలపడ్డారు విజయశాంతి.

దాంతో ఆగలేదు... మరో పెద్ద పార్టీలో చేరి అక్కడా ఎన్నికల్లో ఓడిపోయి ఇక రాజకీయ సన్యాసమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారు. 2016 సంవత్సరం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయశాంతి మళ్ళీ రాజకీయాల్లోకి తిరిగి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారు. నేరుగా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి సంప్రదింపులు జరిపారు.
 
రాహుల్ గాంధీతో నేరుగా విజయశాంతికి గత కొన్ని సంవత్సరాలుగా పరిచయాలున్నాయి. అందులోను ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. అందుకే రాములమ్మకు ఆ పార్టీపైన ప్రేమ పుట్టుకొచ్చింది. రాహుల్ గాంధీలోని ధైర్యం, ఏదో ఒకటి చేయాలన్న కసి తనకు బాగా నచ్చుతుందని అందుకే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సారథ్యంలో తిరిగి పనిచేయాలన్న ఆలోచనలో విజయశాంతి ఉన్నారు. 
 
అయితే కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పటికే తెదేపా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ నీటి బిందువు అని చెప్పేశారు. మరి విజయశాంతి వచ్చినా అలాంటి పరిస్థితే వుంటుందేమో...?