శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:12 IST)

బూమ్రా అంటే పడిచస్తోన్న రాశిఖన్నా.. ప్రేమలో పడిందా?

దక్షిణాది ముద్దుగుమ్మ, హీరోయిన్ రాశిఖన్నా.. భారత బౌలర్ బూమ్రా అంటే చాలా ఇష్టమంటోంది. భారత క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా చూస్తానని తెలిపింది. ఏ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కానని.. అయితే ఇందుకు కారణం బూమ్

దక్షిణాది ముద్దుగుమ్మ, హీరోయిన్ రాశిఖన్నా.. భారత బౌలర్ బూమ్రా అంటే చాలా ఇష్టమంటోంది. భారత క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా చూస్తానని తెలిపింది. ఏ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కానని.. అయితే ఇందుకు కారణం బూమ్రా మాత్రమేనని చెప్పింది. బూమ్రా అంటే తనకు చాలా ఇష్టమని.. బూమ్రాకి పెద్ద ఫ్యాన్‌ని అని తెలిపింది. 
 
బూమ్రా కోసమే మ్యాచ్‌లు చూస్తానని.. రాత్రిపూట మ్యాచ్‌లు జరిగినా వదిలిపెట్టకుండా చూస్తానని వెల్లడించింది. ఇప్పటికే బూమ్రా బౌలింగ్‌పై సోషల్ మీడియాలో అనేకసార్లు ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్- రాశిఖన్నా జంటగా నటించిన 'తొలిప్రేమ' సినిమా ఈ నెల పదో తేదీన విడుదల కానుంది. 
 
ఈ నేపథ్యంలో బూమ్రా అంటేనే పడిచస్తోన్న రాశిఖన్నా వ్యవహారం చూస్తుంటే ఆమె బూమ్రా ప్రేమలో పడిపోయిందా అంటూ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీమణులు విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను ప్రేమించి వివాహమాడారు. ఇదే తరహాలో బూమ్రాను కూడా రాశిఖన్నా ప్రేమించి వివాహం చేసుకోనుందా అంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
భారత్ యువ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా అంటే రాశిఖన్నా చాలా ఇష్టమని చెప్పడంతో అమ్మడు భవిష్యత్తులో అతనిని వివాహమాడినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.