Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దివ్య ఉన్ని రెండో వివాహం చేసుకుంది.. ఫోటోలు

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (17:28 IST)

Widgets Magazine

ఇల్లాలు ప్రియురాలు సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ''దివ్య'' మలయాలంలో అగ్రహీరోల సరసన నటించింది. నటిగా, నృత్యకారిణిగా మంచి గుర్తింపు పొందిన దివ్య ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. దాదాపు 45 సినిమాలకు పైగా నటించిన దివ్య.. హ్యూస్టన్‌లోని గురువయప్పన్ ఆలయంలో అమెరికాకు చెందిన సాఫ్ట్‌‍వేర్ ఉద్యోగి అరుణ్ కుమార్ మణికందన్‌ను వివాహం చేసుకుంది. 
 
ఈ వివాహ వేడుక ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య జరిగింది. తన రెండో పెళ్లి విషయాన్ని నటి దివ్య స్వయంగా ప్రకటిస్తూ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాగా గతంలో ఈమె అమెరికాకే చెందిన ఓ వైద్యుడిని వివాహం చేసుకుంది. అతనితో విడాకులు తీసుకుంది. వీరికి అరుణ్‌, మీనాక్షి అనే ఇద్దరు పిల్లలున్నారు.
 
అమెరికాలో డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న దివ్య దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. కానీ తొలి భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరమైందని మలయాళ సినీ వర్గాల సమాచారం. 
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలకృష్ణ- ఎన్టీఆర్ బయోపిక్‌లో?

నందమూరి హీరో బాలకృష్ణ కుడిభుజానికి శనివారం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి ...

news

సిల్క్ స్మితకు అప్పటి నుంచే దూరమయ్యాను: మాస్టర్ శివశంకర్

అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మిత అందానికి ఫిదా కాని ...

news

అమలాపాల్ భేష్.. ధైర్యాన్ని కొనియాడిన నడిగర్ సంఘం

సినీనటి అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. లగ్జరీ కారు కేసులో పన్ను ఎగవేతతో కష్టాలు ...

news

ఆ తండ్రి ఎక్కుడున్నాడో కనుక్కోండి.. నేను చావగొడతా: సుధీర్ బాబు

బెంగళూరులో హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని కన్నకుమారుడిని చితకబాదిన ఓ తండ్రిపై ...

Widgets Magazine