శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 17 నవంబరు 2017 (18:42 IST)

ఆ నంది అవార్డు నాకొద్దు బాబోయ్.. బాలక్రిష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో నంది అవార్డులకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదు. హాలీవుడ్ ఆస్కార్ పురస్కారం ఎలాగో టాలీవుడ్‌లో నంది అవార్డు అందుకోవడాన్ని అందరూ అంతటి ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అంతటి గొప్ప అవార్డు తమకు అందకపోతే నటీనటులు, ఇతర టెక్నీషియన్లు తీవ్ర న

తెలుగు చిత్ర పరిశ్రమలో నంది అవార్డులకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదు. హాలీవుడ్ ఆస్కార్ పురస్కారం ఎలాగో టాలీవుడ్‌లో నంది అవార్డు అందుకోవడాన్ని అందరూ అంతటి ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అంతటి గొప్ప అవార్డు తమకు అందకపోతే నటీనటులు, ఇతర టెక్నీషియన్లు తీవ్ర నిరాశపడిపోతారు. కానీ నంది అవార్డుల పేర్ల ప్రకటన తరువాత ఆ విషయం కాస్తా వివాదాస్పదమవుతోంది. 
 
ఎపి ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో రాజకీయ జోక్యం ఉందని, అయినవారికే అవార్డులు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి ఆరోపణలే వచ్చినా ఎవరూ బహిరంగంగా విమర్శించిన దాఖలాలు లేవు. కానీ మొదటిసారి సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కొంతమంది నంది అవార్డుల జాబితాపై ఫైరయ్యారు. గుణశేఖర్, బన్నీ వాసు, బండ్ల గణేష్, నల్లమలపు బుజ్జీ లాంటి ప్రముఖులు ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు చేశారు.
 
బాలక్రిష్ణ నటించిన లెజెండ్ సినిమాకు అవార్డుల పంట పండటంపై సర్వత్రా విమర్శలు చేస్తున్నారు సినీ ప్రముఖులు. 2014 నంది అవార్డుకు లెజెండ్ సినిమా తప్ప మిగిలిన ఏ సినిమాలు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు సినీ ప్రముఖులు. మనం సినిమాకు ఏం తక్కువైందని, ఆ సినిమాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించడం ఏమిటని నిలదీస్తున్నారు. బాలక్రిష్ణపై ఎవరూ సూటిగా విమర్శలు చేయడంలేదు. అవార్డుల ప్రకటనపై ఇప్పటివరకు బాలక్రిష్ణ ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
అయితే ఇలాంటి పరిస్థితుల్లో నంది అవార్డును తీసుకోకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారట బాలక్రిష్ణ. తాను హిందూపురం ఎమ్మెల్యేగా, అలాగే చంద్రబాబుకు సన్నిహితుడు కావడంవల్లే తనకు ఈ అవార్డు వచ్చిందని కొంతమంది విమర్శలు చేయడం వల్ల బాలక్రిష్ణ మనస్థాపం చెందారట. ఈ అవార్డును తీసుకోకపోవడమే మంచిదన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చేశారట బాలక్రిష్ణ. మరి ప్రభుత్వం నంది అవార్డును రెడీ చేసి రమ్మని ఆహ్వానిస్తే బాలయ్య వెళ్లి తీసుకుంటారో లేదో చూడాలి.