దసరా బ్లాక్‌బస్టర్ : ఆల్టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'

బుధవారం, 4 అక్టోబరు 2017 (10:44 IST)

jai lava kusa

దసరా పండుగకు విడుదలైన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ" చిత్రం నిలిచింది. బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన రిలీజ్ అయిన విషయం తెల్సిందే. 
 
దసర పండుగ రోజుల్లో ఈ సినిమా ఒక రేంజ్‌లో సందడి చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఇప్పటికీ ఈ సినిమా జోరు తగ్గకపోవడం విశేషం. ఇంతవరకూ ఈ సినిమా రూ.125 కోట్లపై పైగా గ్రాస్‌ను వసూలు చేసింది.
 
ఈ యేడాది ఈ స్థాయి వసూళ్లను సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ముందు 'బాహుబలి 2', 'ఖైదీ నెంబర్ 150' వున్నాయి. ఇక తెలుగులో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన చిత్రాల్లో 'జై లవ కుశ' 8వ స్థానాన్ని సంపాదించుకుంది.
 
అలాగే, మొదటి ఏడు స్థానాల్లో బాహుబలి, బాహుబలి 2, ఖైదీ నెంబర్ 150, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, సరైనోడు సినిమాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వదినమ్మా మళ్లీ పెళ్లి కావాలా? అయితే, 'పీకే సార్‌'ను చేసుకోండి : ఫ్యాన్స్ సలహా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మాజీ భార్యపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒంటరి జీవితం గడపలేక ...

news

ఆమె కళ్లలో ఓ మెరుపు ఉంది : అనురాగ్ బసు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు ప్రశంసల వర్షం కురిపించారు. ...

news

మా ఆయన వస్తే అంతా మంచే జరుగుతుంది : లతా రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఆయన భార్య లతా రజనీకాంత్ ఆసక్తికర ...

news

మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ, రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పైన ఫేస్ బుక్ లో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు ...