Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కరణ్ జోహార్‌తో కోల్డ్ వారా? ప్రభాస్ అంత అడిగాడా? అసలేం జరుగుతోంది?

గురువారం, 22 ఫిబ్రవరి 2018 (15:32 IST)

Widgets Magazine

డార్లింగ్ ప్రభాస్‌కు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్‌కు కోల్డ్ వార్ జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కరణ్ జోహార్ భారీ ప్రాజెక్టు కోసం డార్లింగ్‌ను సంప్రదించారట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ పారితోషికం భారీగా అడిగారట. 
 
ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.20కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. కరణ్ జోహార్ షాక్ అయ్యారట. అంతేకాకుండా ఆ ప్రాజెక్టును పక్కనబెట్టేశారట. దీంతో ప్రభాస్, కరణ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని.. వీరిద్దరి మధ్య కోల్డ్ వారే జరుగుతుందని సమాచారం. ఈ ప్రభావం సాహో సినిమాపై పడిందని సమాచారం. 
 
బాహుబలికి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సాహో చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఉత్తరాది బయ్యర్లు ఆసక్తి చూపట్లేదట. సాహోను భారీ బడ్జెట్‌తోపాటు అత్యంత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే దాదాపు రూ.25కోట్లకు పైగా ఖర్చు చేశారు. అలాంటి ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఉత్తరాది బయ్యర్స్ వెనక్కి తగ్గడానికి.. కరణ్ జోహార్‌తో ప్రభాస్ జగడమే కారణమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
కరణ్ జోహార్- ప్రభాస్ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలొస్తున్న నేపథ్యంలో... కరణ్ జోహార్ గతంలో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ''డియర్ ఆంబిషన్.. నీవేదైనా ఘనత సాధించాలనుకుంటే.. పేరున్న దిగ్గజాలతో పోల్చుకోవడం తగ్గించుకోవాలి'' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రభాస్‌ను ఉద్దేశించినవేనని సినీ జనం అంటున్నారు. మరి ''సాహో'' పరిస్థితి ఏమౌతుందోనని ప్రభాస్ ఫ్యాన్ ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వివాదానికి ప్రభాస్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాజల్ సోదరికి అబ్బాయి పుట్టాడు... కాజల్ అగర్వాల్ ఏం చేసిందో తెలుసా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీ నటి కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్‌కు పండండి మగపిల్లాడికి ...

news

కమెడియన్‌తో పీకల్లోతు ప్రేమలో హాట్ భామ.. ఎవరు?

అంతకుముందు ఆ తరువాత, దర్శకుడు, అమీతుమీ, అ సినిమాలు చూశారా.. ఆ సినిమాలలో నటించిన ఇషా ...

news

కన్నుగీటి.. జుకర్ బర్గ్‌కే చుక్కలు చూపించిన ప్రియా వారియర్

కన్నుగీటి.. తన హావభావాలతో సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన కేరళ కుట్టి ప్రియా ...

news

జీఎస్టీ ట్రైలర్ వద్దు బాబోయ్.. తొలగించిన యూట్యూబ్?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా జీఎస్టీ. ఈ సినిమాలో మియా మాల్కోవా ...

Widgets Magazine