శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:44 IST)

అవకాశాలు రాలేదని దర్శకులకు వాటిని పంపిన హీరోయిన్...

జీవ కథానాయకుడిగా విడుదలైన రంగం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమాలో నటించిన రెండవ హీరోయిన్ ప్రియకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తరువాత మంచి అవకాశాలే వస్తాయని అనుకుంది ప్రియ. కానీ తమిళంలో ఆమెకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంత

జీవ కథానాయకుడిగా విడుదలైన రంగం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమాలో నటించిన రెండవ హీరోయిన్ ప్రియకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తరువాత మంచి అవకాశాలే వస్తాయని అనుకుంది ప్రియ. కానీ తమిళంలో ఆమెకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. అడపాదడపా రెండు సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు.
 
ఇక అక్కడా అవకాశాలు పోయాయి. దీంతో ప్రియ అందాలను ఆరబోసే ఫోటో షూట్‌ను తయారుచేసి దర్శకులకు పంపింది. నా అందాలను చూసి నాకు అవకాశమివ్వమని దర్శకులను ప్రాధేయపడింది. అవకాశాలు లేనంత మాత్రాన ఇలాంటి పని చేయాలా అని కొంతమంది దర్శకులు చర్చించుకుంటుంటే మరికొంతమంది దర్శకులు మాత్రం ప్రియ అందాలను సినిమాలో వాడాలని నిర్ణయించుకున్నారు. మరి ప్రియకు ఏ మాత్రం అవకాశాలు వస్తాయో వేచి చూడాల్సిందే.