పూజా హెగ్డేకు సూపర్ ఛాన్స్.. జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్

సోమవారం, 5 మార్చి 2018 (13:34 IST)

pooja hegde

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ సుందరి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. డీజేలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా.. ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. 
 
ఇకపోతే.. పూజా హెగ్డే ''సాక్ష్యం'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ''రంగస్థలం''లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ సినిమాలో నటించనున్న పూజా హెగ్డే.. మహేష్ బాబు చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది.
 
ఇకపోతే.. ఎన్టీఆర్‍‌ ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గారు. ఈ క్రమంలో గత కొన్ని వారాలుగా ఎన్టీఆర్ వర్కౌట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా షూటింగ్ ముగిశాక, జూనియర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి రానుంది. దీనిపై మరింత చదవండి :  
పూజా హెగ్డే జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ రంగస్థలం సాక్ష్యం April Ntr 28 Pooja Hegde Ntr Jr

Loading comments ...

తెలుగు సినిమా

news

చెన్నై సముద్రంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం?

ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె ...

news

సన్నీలియోన్-వెబర్ దంపతులకు కవలలు (ఫోటో చూడండి)

సెర్చింజన్ గూగుల్‌లో నెటిజన్లు ప్రతి చిన్న విషయం కోసం వెతికేస్తున్నారు. అలాంటిది ...

news

రజనీకాంత్ #2point0 మేకింగ్ వీడియో (Making of 2.0 VFX Featurette)

సూపర్‌స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం "2.O". ఈ ...

news

స్టీవ్ హ్యారీ షో‌లో చిరంజీవి సాంగ్... ఉర్రూతలూగించిన 'సన్నాజాజాలా చుట్టేసిందిరో...' (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ ...