Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరోసారి "తొలిప్రేమ" సినిమాలో కనిపించనున్న పవన్ కళ్యాణ్??

గురువారం, 4 జనవరి 2018 (17:47 IST)

Widgets Magazine
pawan

తొలిప్రేమ సినిమా "పవన్ కళ్యాణ్" సినీ జీవితంలో నేటికీ ఒక మరుపురాని చిత్రంగా ఉంది. ఈ చిత్రం కమర్షియల్‌గానే కాకుండా తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. 1998వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకి కరుణాకరణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం టైటిల్‌తో 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ నెట్‌లో హల్చల్ చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 
 
రాశీఖన్నా వరుణ్ తేజ్‌కి జోడీగా నటిస్తోంది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కొంతసేపు వరుణ్‌తేజ్‌తో పాటుగా స్క్రీన్‌పై కనిపించబోతున్నారని సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌‌కి వరుణ్ తేజ్, నాగబాబులపై ఉన్న అభిమానంతో ఇందుకు ఒప్పుకున్నాడని సమాచారం.
 
గతంలో ఇదే బ్యానర్‌లో పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రాన్ని నిర్మించిన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో పవన్ ఈ చిత్రంలో కనిపించడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు భోగట్టా. గతంలోనూ పవన్ శంకర్‌దాదా జిందాబాద్ చిత్రంలోనూ అతిథిపాత్రలో మెరిసాడు. ఇక ఆ చిత్రంలో తాను ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ సంక్రాంతికి రిలీజ్‌కానున్న తన "అజ్ఞాతవాసి" సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లికూతురు కానున్న 'పద్మావతి' : రేపు నిశ్చితార్థం?

బాలీవుడ్ హీరోయిన్ 'పద్మావతి' (దీపికా పదుకొనె) పెళ్లికుమార్తె కానుంది. గత ఐదేళ్లుగా ...

news

తండ్రిని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించిన హీరో

మెగా సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరు. తన సినీ కెరీర్‌లో ...

news

ప్రవాసాంధ్రులకు "అజ్ఞాతవాసి" సందేశం (వీడియో)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన ...

news

హీరో నాగార్జునకు షాకిచ్చిన కేంద్రం.. గుర్తింపు రద్దు

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని కుటుంబానికి ...

Widgets Magazine