బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: సోమవారం, 16 జులై 2018 (20:59 IST)

సైరాలో చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంద‌నే విష‌యం తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంద‌నే విష‌యం తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. చిరంజీవి, సుదీప్ మ‌రికొంత మందిపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీకరిస్తున్నారు. 
 
ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నాడని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ ఖైదీ నెం 150లో చిరుతో క‌లిసి చ‌ర‌ణ్ ఓ సాంగ్‌లో కనిపించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సైరాలో కూడా చ‌ర‌ణ్ ఓ సీన్‌లో క‌నిపించ‌నున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి.. ఇది నిజ‌మా కాదా అనేది తెలియాల్సి వుంది. ఈ భారీ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.