Widgets Magazine

ఆండ్రికోచివ్‌తో శ్రియ పెళ్లి.. తేజ, వెంకీ సినిమాకు రూ.60లక్షలు తీసుకుందట..

బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:47 IST)

Shriya,  Venkatesh

టాలీవుడ్ అగ్రనటి శ్రియా త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రష్యన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రికోచివ్‌ను మనువాడనుందని టాక్ వస్తోంది. రష్యా క్రీడాకారుడితో శ్రియ ఇన్నాళ్లు శ్రియ ప్రేమలో వున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రియ-ఆండ్రికోచివ్ వివాహం ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరుగనుందని తెలిసింది. మూడు రోజుల పాటు ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో  టాక్ వస్తోంది. 
 
మార్చి 17,18, 19 తేదీల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇటీవల శ్రియ భారీగా చీరలు, నగలు కొనుగోలు చేసిందని.. త్వరలో ఆమె పెళ్లి కూతురు కానుందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను శ్రియ ఖండించింది. తన స్నేహితురాలి పెళ్లి కోసమే ఈ నగలను కొనుగోలు చేశానని క్లారిటీ ఇచ్చింది. మరి రష్యన్ క్రీడాకారుడితో శ్రియ వివాహం జరుగనుందని వస్తున్న వార్తలపై శ్రియ స్పందించలేదు.
 
మరోవైపు.. ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించింది. ఆమెను మళ్లీ తన సినిమాలో నటింపజేయడం ఇష్టం లేక శ్రియను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా కాజల్ అగర్వాల్‌ను సంప్రదిస్తే పారితోషికంగా కోటికి పైగా అడిగిందని.. దీంతో శ్రియను రూ.60లక్షలకు నిర్మాతలు ఖరారు చేసినట్లు సమాచారం.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జమునకు కీర్తి సురేష్ ఝలక్ ఇచ్చిందా?: సావిత్రి గారి గురించి బాగా తెలుసు..

అలనాటి తార సావిత్రి జీవితకథను దర్శకుడు నాగ అశ్విన్ ''మహానటి'' పేరిట బయోపిక్ ...

news

శ్రీదేవి మరణంపై మీడియా సర్కస్ చూస్తే కోపం వస్తోంది: ప్రీతి జింటా

సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న ...

news

వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా.. శ్రీదేవి: వర్మ పోస్ట్ చేసిన లేఖలో?

దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని ...

news

మానవా ఇక సెలవ్ అంటూ దేవకన్యలా ముస్తాబై శ్రీదేవి వెళ్లిపోయింది...

భూలోక అతిలోకసుందరి శ్రీదేవి ఇకలేరు. భూమిపై ఆమె ఇక కంటికి కనిపించరు. దేవకన్యలా ముస్తాబై ...

Widgets Magazine