'స్పైడర్' బిజినెస్ రూ.124 కోట్లు.. కలెక్షన్లు రూ.55 కోట్లు... భారీ నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్లు

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (11:14 IST)

mahesh spyder

దసరా పండగకు విడుదలై సందడి చేస్తున్న చిత్రాల్లో మహేష్ బాబు నటించిన 'స్పైడర్' ఒకటి. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అయితే, ఈ చిత్రం ఏకంగా రూ.124 కోట్ల మేరకు బిజినెస్ చేసింది. కానీ, కలెక్షన్ల పరంగా తుస్‌మనిపించింది. 
 
భారీ అంచనాల మధ్య విడుదైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. కానీ ఆ తర్వాత చాలా వేగంగా ఈ సినిమా వసూళ్లు పడిపోతూ వచ్చాయి. దాంతో పంపిణీదారులకు భారీ నష్టాలు తప్పవనేది ట్రేడ్ వర్గాల మాట.
 
దాదాపు ఈ సినిమా రూ.124 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది. తొలి వారాంతంలో రూ.45 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. రెండోవారం .. మూడోవారంలోనీ కలుపుకుని ఈ సినిమా మరో రూ.10 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అంటున్నారు. 
 
ఆవిధంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.55 కోట్ల షేర్ మాత్రమే ఉండే అవకాశం ఉందనేది ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ. స్టార్ హీరోలకి అప్పుడప్పుడు ఇలాంటి పరాజయాలు ఎదురుకావడం సహజమేననే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై మరింత చదవండి :  
Spyder Distributor Losses Heroine Boxoffice Collections

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగచైతన్య పెళ్లికొడుకైన వేళ.. ఫోటోస్ చూడండి (వీడియో)

అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం హీరోయిన్ సమంతతో నాగచైతన్య వివాహం ...

news

సాహోకు అవే హైలైట్స్: ప్రభాస్-శ్రద్ధాకపూర్‌ల మధ్య ఘాటైన రొమాన్స్?

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ...

news

మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఇదే!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన స్పైడర్‌ సినిమా సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్ల వర్షం ...

news

సుడిగాలి సుధీర్‌తో ప్రేమా లేదు.. పెళ్లీ లేదు: ఫేస్‌బుక్ లైవ్‌లో రష్మీ

సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారంపై ఫేస్‍‌బుక్ లైవ్‌లో రష్మీ స్పందించింది. ఫేస్‌బుక్ ...