Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్యాండిల్ లైట్ డిన్నర్‌లో వీరు ప్రపోజ్ చేశారు.. 24న పెళ్లి : నమిత

ఆదివారం, 12 నవంబరు 2017 (17:40 IST)

Widgets Magazine
namitha - veeru

బొద్దుపిల్ల నమిత తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పష్టతఇచ్చారు. తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. తమ వివాహం ఈనెల 24వ తేదీన తిరుపతిలో జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ, తన భర్త గురించి, తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
 
వీరు తనకు బెస్ట్ ఫ్రెండ్ అని... అతను నిర్మాత మాత్రమే కాదు మంచి నటుడు కూడా అని చెప్పింది. తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని చెప్పింది. తమ కామన్ ఫ్రెండ్ శశిధర్ 2016లో తనకు వీర్‌ను పరిచయం చేశాడని... అలా తమ మధ్య స్నేహం ప్రారంభమైందన్నారు.
 
2017 సెప్టెంబర్ 6న బీచ్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసి, వీర్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. అలాంటి సర్‌ప్రైజ్‌ను తాను ఊహించలేదని... అయితే, తమ అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే కావడంతో... వీర్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేశానని తెలిపింది.
namitha - veeru
 
ఈ మూడు నెలల కాలంలో వీర్‌ను తాను ఎంతో అర్థం చేసుకున్నానని చెప్పింది. వాస్తవానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్‌ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా కూతురు నవ్వితే ఎంత కష్టాన్నయినా మరిచిపోతా : అల్లు అర్జున్

ప్రతి తల్లిదండ్రులకు వారివారి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వెళితే ...

news

నేను రాముణ్ణి కాదు.. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయి : 'గరుడవేగ' హీరో

"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని ...

news

లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి వార్నింగ్... ఆమె నిజస్వరూపం బయటపెడతాం

స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతికి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్ర ...

news

హీరోలు రాజకీయాల్లోకి రావడం దేశానికి విపత్తు: ప్రకాశ్ రాజ్

తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ...

Widgets Magazine