Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్'... అక్షయ్ కుమార్ శానిటరీ 'ప్యాడ్‌ మాన్' పట్టించాడు కానీ...

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (18:32 IST)

Widgets Magazine

అక్షయ్ కుమార్ హీరోగా తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ప్యాడ్ మాన్. ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలైంది. కానీ తేడా కొట్టేసిందంటూ విశ్లేషకులు తమ రివ్యూలలో దంచేస్తున్నారు. మహిళల సమస్య అయిన ఆ ఐదు రోజుల గురించి అక్షయ్ కుమార్ తీసిన చిత్రమే ప్యాడ్ మాన్. అక్కడక్కడ మహిళలను ఇబ్బందిపెట్టే సంభాషణలు ఈ చిత్రంలో వున్నట్లు చెపుతున్నారు. 
pad man
 
ముఖ్యంగా కొందరు యువకులు మహిళల బహిష్టు కాలాన్ని ఫైవ్ డే టెస్ట్ మ్యాచ్ అంటూ కామెంట్లు చేయడం... తదితర సంభాషణలు ఎబ్బెట్టుగా వున్నట్లు విశ్లేషణల్లో తెలుపుతున్నారు. మొత్తమ్మీద ఈ చిత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోకపోగా విమర్శలను మూటగట్టుకుంటోంది. 
Deepika
 
ఈ చిత్రం కోసం ఐస్‌ బకెట్‌ చాలెంజ్, రైస్‌ బకెట్‌ చాలెంజ్‌ ప్యాడ్ మాన్ ఛాలెంజ్ అంటూ ప్రమోషన్ చేయించారు. అమీర్ ఖాన్ శానిటరీ ప్యాడ్ పట్టుకుని మీరు చాలెంజ్ చేయండంటూ బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌లకు సవాల్ విసిరాడు. ప్యాడ్ మాన్ అనేది శానిటరీ ప్యాడ్ సృష్టిక‌ర్త అరుణాచలమ్‌ మురుగనాథమ్ జీవిత క‌థ ఆదారంగా తెర‌కెక్కిన చిత్రం. అక్ష‌య్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వరి 9న రిలీజ్ అయింది. ఆర్ బాల్కీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
PV Sindhu
 
ప్యాడ్ మాన్ చిత్ర నిర్మాత‌, అక్ష‌య్ కుమార్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా తనదైన శైలిలో ప్రమోషన్ చేయించినప్పటికీ ప్యాడ్ మాన్ మంచి చిత్రమే అయినప్పటికీ ఎక్కడో తేడా వుందనే కామెంట్లు వస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Arunachalam Muruganantham Pad Man Sonam Kapoor Radhika Apte

Loading comments ...

తెలుగు సినిమా

news

తెలుగు బిగ్ బాస్ -2.. జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాత?.. 100 రోజులు?

''బిగ్ బాస్'' షోకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన బిగ్ బాస్ ...

news

ఆది నా కొడుకు కాదు.. దేవుని బిడ్డ - సాయికుమార్(వీడియో)

విలక్షణమైన డైలాగ్‌లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుల్లో సాయికుమార్ ఒకరు. ఒకప్పుడు ...

news

జనవరిలో విశాల్ పెళ్లి.. నడిగర్ సంఘం కొత్త భవనంలోనే.. వధువు వరమ్మేనా?

పందెంకోడి హీరో విశాల్ వివాహం చేసుకోబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆర్కే ...

news

ఆ ఫిలిమ్ నాది కాదు.. మార్ఫింగ్ చేసి పెట్టారు: మోడల్ శ్యామల

యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ బ్లూ ఫిల్మ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలపై శ్యామల ...

Widgets Magazine