శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:48 IST)

వ్యక్తిని ఢీకొట్టిన రష్మీ కొత్తకారు... చిక్కుల్లో యాంకర్

బుల్లితెర యాంకర్ రష్మీ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఇటీవల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ కారు కారణంగా ఆమె ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఈ కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యాంకర్ రష్మీ ఇటీవల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ కారులో ఆమె వెళుతుండగా, విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 సమయంలో జరిగింది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో రష్మీ ఆందోళన చెందుతోంది.