వరుణ్ తేజ్ "అంతరిక్షం" ట్రైలర్
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం. ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి అంతరిక్షం నేపథ్యంలో వస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ స్పేస్ సైంటిస్టుగా కనిపించనున్నాడు. వరుణ్ సరసన అదితి రావు హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని చాలా సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌పై చిత్రీకరించారు. ఆదివారం రోజు 'అంతరిక్షం' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజువల్ వండర్‌గా అంతరిక్షం ఉండనుందని సినీ యునిట్ తెలిపింది. ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో ఓసారి చూడండి.