సూపర్ హీరోయిన్‌కు వేధింపులు.. చంపేస్తామని బెదిరింపులు.. ఎవరు?

సినీ హీరోయిన్లకు ఓ వైపు క్యాస్టింగ్ కౌచ్‌తో తలనొప్పి తప్పట్లేదు. మరోవైపు బయటి వ్యక్తుల నుంచి హీరోయిన్లు వేధింపులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలుగులో ''సూపర్'' చిత్రంతో సినీ ప్రేక్షకులను పలకరించిన ఆయేషా

selvi| Last Updated: బుధవారం, 4 జులై 2018 (13:03 IST)
సినీ హీరోయిన్లకు ఓ వైపు క్యాస్టింగ్ కౌచ్‌తో తలనొప్పి తప్పట్లేదు. మరోవైపు బయటి వ్యక్తుల నుంచి హీరోయిన్లు వేధింపులు ఎదుర్కొంటున్నారు. తాజాగా తెలుగులో ''సూపర్'' చిత్రంతో సినీ ప్రేక్షకులను పలకరించిన ఆయేషా టకియాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.


అయేషాతో పాటు, ఆమె కుటుంబీకులను ఓ వ్యక్తి వేధిస్తున్నాడట. చంపేస్తానని బెదిరిస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయేషా ఫర్హాన్ అజ్మీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 
 
బెదిరింపులు, వేధింపులు పెరిగిపోతున్న కారణంగా ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్‌లు తమకు సాయపడాలని విజ్ఞప్తి చేస్తూ ''బేటీ బచావో'' అని ఓ పోస్టు పెట్టారు. డీసీపీ దహియాకు ఫిర్యాదు చేస్తే ఆయన చూసీ చూడనట్టు ఊరుకున్నారని ఆరోపించారు. 
 
ఇంకా దహియాకు చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్లను ఫర్హాన్ పోస్టు చేసి, తమకు మద్దతు తెలపాలని నెటిజన్లను కోరారు. ఆయన వరుసగా ట్వీట్లు పెడుతుండటంతో ముంబై జాయింట్ సీపీ దేవేన్ భారతి స్పందించి, విచారించి నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా నెటిజన్లు కూడా ఫర్హాన్‌కు మద్దతు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.



దీనిపై మరింత చదవండి :