Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దీపికా పదుకునే తలకు వెలకట్టిన బీజేపీ నేత రాజీనామా

బుధవారం, 29 నవంబరు 2017 (16:03 IST)

Widgets Magazine

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్రలో నటించిన పద్మావతి చిత్రాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. దీన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. పద్మావతీ సినిమాకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఇలాంటి వ్యాఖ్యలు చట్టాలను అతిక్రమించినట్లేనని.. ఈ విషయాన్ని సదరు వ్యక్తులకు తెలియజేయాలని అదనపు సొలిసిటర్స్‌ జనరల్‌ మనిందర్, పీఎస్‌ నరసింహాలను ఆదేశించింది. 
 
ఇప్పటికే పద్మావతిపై హర్యానా బీజేపీ నేతలు, యూపీ సీఎం యోగి మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల తలలకు రూ.10కోట్లు వెలకట్టిన బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. దీంతో బీజేపీ సూరజ్ పాల్ రాజీనామా చేశారు. బీజేపీ అధిష్టానం, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో విబేధాల కారణంగా తాను రాజీనామా చేశారని చెప్పారు. అయితే ఖట్టర్‌పై సూరజ్ పాల్ విమర్శలు గుప్పించారు. ఖట్టర్ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. కార్యకర్తలకు ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వరన్నారు.
 
ఇకపోతే.. పద్మావతి సినిమాపై రాజ్ పుత్ కర్ణిసేన నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. అయితే హర్యానా సర్కారు సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్) నిర్ణయాన్ని బట్టి పద్మావతి సినిమా రిలీజ్‌పై నిర్ణయం వుంటుందని తేల్చేసింది. డిసెంబర్ 1 నాటికి పద్మావతి సినిమాను విడుదల చేయాల్సింది. కానీ ఆందోళనలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ సినిమాను బ్యాన్ చేయడంతో విడుదలక నోచుకోలేదు. అయితే సీబీఎఫ్‌సీ నిర్ణయం ప్రకారం పద్మావతి విడుదల వుంటుందని సినీ పండితులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్ ఇమేజ్‌ దెబ్బకు ఇవాంకా ట్రంప్ కూడా భయపడిపోయారా....

మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి రచ్చ మొదలైంది. ఇదేదో సినిమా గురించి కాదు. ఆయన పెళ్లి ...

news

నగ్నంగా సన్నీ లియోన్ దంపతులు (వీడియో)

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. ఒకపుడు పోర్న్ స్టార్. బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేశాక తన ...

news

నిషా అగర్వాల్ సీమంతం ఫోటోలు (వీడియో)

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ శీమంతానికి సంబంధించిన ఫోటోలు ...

news

ఇవాంకా వచ్చిందని హడావుడి ఎందుకు..? ఏంటో ఈ ఖర్మ?: మాధవీలత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ రాకతో హైదరాబాద్ రంగు రంగులతో ...

Widgets Magazine