Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శింబుకున్న తెలివి కూడా రజనీ, కమల్‌కు లేదా?: అనంత్ నాగ్

బుధవారం, 11 ఏప్రియల్ 2018 (11:12 IST)

Widgets Magazine

తమిళ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్‌లపై కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ ధ్వజమెత్తారు. కమల్, రజనీకాంత్ నటులిద్దరూ కరుడుగట్టిన రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కావేరి జలాల పంపిణీ అంశంపై వీరిద్దరు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.

తమిళనాడుకు ఎంత వాటా వస్తుందో, ఆ వాటాను ఇవ్వాలని తమిళ యువ నటుడు శింబు అన్నాడని, ఆ మాత్రం పరిపక్వత కూడా రజనీకాంత్, కమల్ హాసన్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నాడు. 
 
కర్ణాటక నుంచి తమిళనాడు నీళ్లివ్వాలని శింబు తన ప్రెస్‌మీట్ సరిగ్గా అడిగాడని.. అతని మాటల్లో రాజకీయాలు కనిపించలేదని.. అయితే రజనీ, కమల్ వ్యాఖ్యల్లో రాజకీయ నేతల శైలి బాగా కనిపిస్తోందని అనంత్ నాగ్ దుయ్యబట్టారు. వచ్చే నెలలో కర్ణాటకలో కొత్త సర్కారు ఏర్పడబోతుందని.. అప్పటివరకైనా నటులిద్దరూ ఆగివుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
తమిళ రాజకీయ నేతలు కావేరీ వివాదాన్ని పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేస్తున్నారని అనంత్‌ నాగ్ ఆరోపించారు. ఆఫ్రికాలో నైలు నది సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జలవివాదాలు పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు. 

కానీ, తమిళ నేతలు మాత్రం కావేరీ వివాదానికి మాత్రం పరిష్కారం చూపకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారని ఆరోపించారు. 138 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం ఇంకెన్నాళ్లు కొనసాగాలని ప్రశ్నించారు. కన్నడిగుల మంచితనాన్ని చేతకాని తనంగా భావించవద్దని హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టాలీవుడ్ శ్రీరెడ్డికి బాలీవుడ్ భామ కంగ‌న మ‌ద్ద‌తు.. కానీ ఆ రూటు సరికాదు..

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంపై పోరాటం చేస్తోన్న శ్రీరెడ్డి ...

news

మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ బాట‌లో స్టైలీష్ స్టార్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కాకుండా ...

news

శ్రీరెడ్డి లీక్స్: దిల్‌రాజు పోతే శని వదిలిపోతుంది.. అభిరామ్ ఎలా ముద్దెట్టుకున్నాడో?

శ్రీరెడ్డి లీక్స్ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై ...

news

త‌ల్లి అయ్యేందుకు టైమ్ ఉందంటోన్న హీరోయిన్

త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తి కాలంలోనే ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకుని మంచి ...

Widgets Magazine