ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (13:09 IST)

టాలీవుడ్ హాస్యనటుడు సూసైడ్

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. బొమ్మరిల్లు చిత్రంతో వెండితెరకు పరిచయమైన హాస్యనటుడు విజయ్ సాయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్, యూసుఫ్ గూడలోని తన సొంత ఫ్లాట్‌లోనే విజయ్ సూసైడ్ చేసుకున్నాడు.

గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర డిప్రెషన్‌కు గురైనట్టు సమాచారం. అదేసమయంలో సినీ అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించి విఫలమయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. 
 
కాగా, విజయ్ సాయి బొమ్మరిల్లు, అమ్మాయిలు, అబ్బాయిలు, మంత్ర, ఒకానొక్కడు వంటి చిత్రాల్లో నటించాడు. కాగా, విజయ్ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.