మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (14:55 IST)

చీరకట్టులో దంగల్ భామ ఫాతిమా-ఫోటోలు వైరల్ (Photo)

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ప్రేక్షకులను, నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సనా షేక్ ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందూస్థా

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ప్రేక్షకులను, నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సనా షేక్ ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాలో నటిస్తోంది. దంగల్ సిని మాలో గీతా ఫోగాట్ పాత్రలో కనిపించిన ఫాతిమా సనా తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహించిన 'చాచీ 420' సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ మోడ్రన్‌గా ఉంటుంది. 
 
గతంలో, బీచ్‌లో బికినీతో దిగిన ఫోటోలను పోస్టు చేసి, అతివాదుల విమర్శలు ఎదుర్కొన్న ఈమె తాజాగా చీరకట్టులో కనిపించింది. మెరూన్ కలర్ చీర కట్టి ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇంకా సెల్ఫీ శారీ పేరిట తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. 
 
ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చీరలో మరింత గ్లామరస్‌గా వున్నావంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. షేమ్ లెస్ సెల్ఫీ అని మరికొందరు నెటిజన్లు అభినందించారు.