గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (20:40 IST)

తండ్రి అల్లు అర్జున్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కుమార్తె.. ఎందుకు?(Video)

తండ్రీకూతుళ్ల మధ్య ఆప్యాయత, అనురాగం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తల్లి కన్నా తండ్రి మీదే కుమార్తెకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఇక ప్రముఖులు అయితే తమ పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంటారు. ఎఫ్పుడూ సినిమాల్లో బిజీగా ఉండే హీరోలు ఇంట్లో గడపడం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.
 
సినీ నటుడు అల్లు అర్జున్ కూడా తన కుమార్తె అల్లు అర్హతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో కాస్త వాట్సాప్, ఫేస్ బుక్‌లలో హల్చల్ చేస్తోంది. వీడియో మొత్తం వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ తన కుమార్తెతో నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకుంటావు.. నేను చెప్పిన వాళ్లనే పెళ్ళి చేసుకోవాలంటూ చెబుతున్నాడు.
 
అయితే అర్హ మాత్రం నేను నువ్వు చెప్పిన వాడిని పెళ్ళి చేసుకోనని తేల్చి చెబుతోంది. అంతేకాదు ఎంతసేపు అల్లు అర్జున్ చెప్పినా అర్హ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తన కుమార్తె తనకు వార్నింగ్ ఇస్తూ ముద్దుముద్దుగా మాట్లాడుతుండటంతో అల్లు అర్జున్ ఆనందంలో మునిగిపోయారు.వీడియో చూడండి..