బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (13:09 IST)

ఈ పండ్లు ఆరగిస్తే కొలెస్ట్రాల్ మటుమాయం...

శరీరంలో కొవ్వు పేరుకునిపోతుంది. నిత్యం మనం తీసుకునే ఆహారం వల్లే ఈ కొలెస్ట్రాల్ చేరుతుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (ఎల్.డి.ఎల్), మంచి కొలెస్ట్రాల్ (హెచ్.డి.ఎల్) అని ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి మేలు చేస్తే, చెడు కొలెస్ట్రాల్ మాత్రం మనకు చేటు తెస్తుంది. పలు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది.
 
ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అధికంగా బరువు పెరుగుతారు. కనుక ఎవరైనా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాలి. అందుకు నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద సూచించిన విధంగా పలు ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ను అంతం చేయవచ్చు. తద్వారా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. మరి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు నిత్యం తీసుకోవాల్సిన ఆ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
* పెసల మన శరీరానికి పనికొచ్చే శక్తివంతమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ పెసలు అమోఘంగా పనిచేస్తాయి. నిత్యం ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టిన పెసలను నెల రోజుల పాటు తింటే ఆశించిన ఫలితం వస్తుంది.
 
* ఓట్స్, సబ్జా గింజలను రోజూ ఆహారంలో భాగం చేసుకున్నా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 
* నిత్యం ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే యాపిల్‌ను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. లివర్ తయారు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు యాపిల్‌లో ఉంటాయి. 
 
* బీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటుంది. బీన్స్‌లో ఉండే లేసిథిన్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతోపాటు బీన్స్‌లో ఉండే పొటాషియం, కాపర్, పాస్ఫరస్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్‌లు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
 
* ఆంతోసైనిన్స్, టానిన్స్ వంటి పదార్థాలు ద్రాక్షల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ద్రాక్షలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది.
 
* జామ పండ్లలో విటమిన్ సి, పాస్ఫరస్, నికోటిన్ యాసిడ్, సాల్యుబుల్ ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధులు రాకుండా చూస్తాయి.
 
* శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పుట్టగొడుగులు కూడా ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ బి, సి, కాల్షియం, ఇతర మినరల్స్ చెడు కొలెస్ట్రాల్ పని పడతాయి.
 
* అవిసె గింజలు, బాదం పప్పుల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి.
 
* వంటలకు చక్కని రుచి, వాసన తేవడంలో వెల్లుల్లిని మించింది లేదు. కేవలం ఆ విషయంలోనే కాదు, శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలోనూ వెల్లుల్లి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.