Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'పద్మావతి' దీపిక తలను కాపాడుకుందాం : కమల్ ట్వీట్

మంగళవారం, 21 నవంబరు 2017 (11:06 IST)

Widgets Magazine
kamal haasan

విశ్వనటుడు కమల్ హాసన్ మరోమారు బీజేపీ పాలకుల వైఖరిపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ చిత్రం "పద్మావతి" విడుదలకు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు రాజపుత్ర కర్ణిసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించడమేకాకుండా, చిత్రంలో రాణి ప‌ద్మావ‌తి పాత్ర పోషించిన దీపిక త‌ల తెస్తే పది కోట్ల నజరానా ప్రకటిస్తామ‌ని బీజేపీ చీఫ్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ ఎస్పీ అము తెలిపారు. అంతకుముందు శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆమెను శూర్ఫణకతో పోలుస్తూ ముక్కును కత్తిరించాలని.. తల తెగ్గొట్టిన వారికి కోటి రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ వివాదంపై బాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీ భ‌గ్గుమంది. ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు దీపిక‌కి మ‌ద్ద‌తునిచ్చారు. తాజాగా క‌మ‌ల్‌.. దీపిక త‌ల‌కి రేటు క‌ట్ట‌డాన్ని ఆక్షేపిస్తూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు. దీపిక త‌ల‌ను కాపాడుకోవ‌ట‌మే నేను కోరుకునేది. ఆమె శ‌రీరం, స్వేచ్చ కంటే కూడా త‌ల‌నే గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌తంలో నా చిత్రాల‌ను కూడా ప‌లు వ‌ర్గాలు వ్య‌తిరేకించారు. ఏదైనా చర్చలో తీవ్రవాదం దుర్భరమవుతుంది. ఇక భ‌రించింది చాలు.. ప్ర‌జ‌లారా మేల్కొండి. ఇక ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.. ఆమెని ర‌క్షించుకుందాం. అంటూ క‌మ‌ల్ ట్వీట్ చేశారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా కమల్ హాసన్ స‌మాజంలో జ‌రిగే అసాంఘిక కార్య‌క‌లాపాల‌తో పాటుగా ప‌లు స‌మ‌స్య‌లుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులోని అన్నాడీఎంకే అవినీతిమయ పాలనతోపాటు.. హిందూ తీవ్రవాదంపై కూడా ఆయన ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో తాజాగా దీపిక వివాదంపై ఆయ‌న ట్విట్ట‌ర్‌లో సీరియ‌స్ ట్వీట్ చేశారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దీపిక తలకు రూ.10కోట్లు.. జీఎస్టీ కలిపారా? లేదా?: ట్వింకిల్ ప్రశ్న

పద్మావతి సినిమా విడుదల నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు చేస్తున్న ...

news

బట్టల వ్యాపారంలోకి సన్నీ లియోన్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఒక్క బాలీవుడ్‌కే ...

news

కొడకా.. కోటేశ్వరా అంటున్న పవన్.. ఎందుకు?

అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు సాంగ్‌తో గొంతు సవరించుకున్న పవర్ స్టార్ పవన్ ...

news

ఇవాంకాను సన్నీలియోన్‌తో పోల్చిన రామ్ గోపాల్ వర్మ (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాదులో పర్యటించనున్న సంగతి ...

Widgets Magazine