Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఘూమర్ డ్యాన్స్ ఆన్ ఐస్' (వీడియో)

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (17:29 IST)

Widgets Magazine
mayuri bhandari

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'. ఈ చిత్రానికి ఎదురైనన్ని వివాదాలు మరే చిత్రం ఎదుర్కోలేదని చెప్పొచ్చు. బాలీవుడ్ తార దీపికా పదుకొనే, హీరోలు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌లు నటించిన ఈ చిత్రం గత జనవరి 25వ తేదీన రిలీజ్ అయింది. పలు వివాదాలు, బెదిరింపుల మధ్య విడుదలైన 'పద్మావతి' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన పద్మావతి.. సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా ముందుకుసాగుతోంది. 
 
అయితే, ఇందులో ఉన్న పాటల్లో ఘూమర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సాంగ్‌కు దీపికా పదుకోన్ వేసిన స్టెప్స్ కూడా సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. పెద్ద హిట్ అయిన ఈ సాంగ్‌పై ఎన్‌బీఏలాంటి టోర్నీలోనూ అపర్ణ యాదవ్ పర్ఫామ్ చేసింది. తాజాగా ఫిగర్ స్కేటింగ్ చాంపియన్ మయూరి భండారీ ఐస్‌పై వేసిన స్టెప్స్ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్నాయి. ఘూమర్ డ్యాన్స్ ఆన్ ఐస్ పేరుతో మయూరీ ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.
 
స్కేట్స్, రెడ్ కాస్టూమ్స్‌లో మయూరీ చేసిన ఈ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అసలు దీపికాను మించి చేసిందే అంటూ నోరెళ్లబెడుతున్నారు. పద్మావతి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ రాజస్థానీగా ఇదే తన ట్రిబ్యూట్ అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. జనవరి 26న ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటికే 36 వేలకు పైగా వ్యూస్ రాగా, 557 మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో మీరూ చూడండి.. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా.. మనతోనే ఉంటాయి'.. తొలిప్రేమ ట్రైలర్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా తాజా చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రం ఈనెల పదో తేదీన ప్రేక్షకుల ...

news

పసందైన వినోదాన్ని పంచే నాగశౌర్య "ఛలో" (రివ్యూ రిపోర్ట్)

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నాగశౌర్య ఒకరు. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో ...

news

రవితేజ 'టచ్ చేసి చూడు'... రివ్యూ రిపోర్ట్

టచ్ చేసి చూడు నటీనటులు: రవితేజ, రాశిఖన్నా, సీరత్ కపూర్, మురళీశర్మ, ఫ్రెడీ దారూవాలా, ...

news

నేను హీరోయిన్‌ను... నిన్నే పెళ్లాడుతానంటూ యువకులకు టోకరా

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై ...

Widgets Magazine