Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాసుల వర్షం కురిపిస్తున్న 'జై లవ కుశ' - 'స్పైడర్'

మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:23 IST)

Widgets Magazine
jai lava kusa - spyder

దసరా పండుగకు రిలీజ్ అయిన స్టార్ హీరోల చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ", ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "స్పైడర్" చిత్రాలు రూ.వంద కోట్ల మార్కును ఎపుడో దాటేశాయి. 
 
ముఖ్యంగా, సెప్టెంబర్ 21వ తేదీన ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం విడుదలైంది. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను కొట్టేసింది. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'జై లవ కుశ' రెండో వారానికి మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.129 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు.
 
ఇకపోతే.. ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన 'స్పైడర్' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తుంది. సెప్టెంబరు 27న విడుదలైన 'స్పైడర్' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విడుదలైన మొదటి రోజు రూ.51 కోట్లు వసూలు చేసిన 'స్పైడర్', తనదైన వసూళ్లను రాబడుతున్నది. 'స్పైడర్' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంత మెడలో పసుపుతాడు... ఆ ఆఫర్స్ తన్నుకెళుతున్న హీరోయిన్...

సమంతకు పెళ్లయిపోయింది. పసుపు తాడుతో తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల వద్దకు వెళ్లి దీవెనలు ...

news

మెస్మరైజ్ చేస్తున్న 'పద్మావతి' ట్రైలర్

బన్సాలీ మళ్లీ వచ్చాడు. ఓ దేవ్‌దాస్.. రామ్‌లీలా.. బాజీరావ్.. ఇప్పుడు పద్మావతి. ఇండియన్ ...

news

హృతిక్ రోషన్‌కు బిటౌన్ మద్దతు.. కంగనా నిలదొక్కుకోగలదని రంగోలి ఫైర్

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ ఒంటరిగా నిలిచిపోయింది. హృతిక్ రోషన్ వివాదంతో ...

news

జనం - జగం మెచ్చిన దర్శకుడికి బర్త్‌డే విషెస్...

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు వేడుకలు మంగళవారం జరుపుకుంటున్నారు. దర్శకేంద్రుడు ...

Widgets Magazine