శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (15:34 IST)

చెలియా ఫ్లాప్ అవుతుందని తెలుసు.. మణిరత్నం కోసమే ఒప్పుకున్నా: కార్తీ

యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, శకుని, కాష్మోరా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ హీరో సూర్య సోదరుడు కార్తీ. గత ఏడాది అక్కినేని నాగార్జున కార్తీ కలిసి నటించిన ''ఊపిరి'' సినిమాతో

యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, శకుని, కాష్మోరా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ హీరో సూర్య సోదరుడు కార్తీ. గత ఏడాది అక్కినేని నాగార్జున కార్తీ కలిసి నటించిన ''ఊపిరి'' సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను కార్తీ సంపాదించుకున్నాడు. తాజాగా సోలోగా ఖాఖీ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సంచలన కామెంట్స్ చేశారు. 
 
హీరో కార్తీ, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన సినిమా చెలియా. అగ్ర దర్శకులైన మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో అనుకుంటాడు. అలాగే తాను కూడా మణిరత్నం మూవీలో ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసాడు. కాని ''చెలియా'' సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేకపోయింది. కథ విన్నప్పుడే చెలియా ఫ్లాప్ అవుతుందని తనకు తెలుసునని కార్తీ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 
 
కానీ అగ్ర దర్శకుడు మణిరత్నంతో కలిసి పనిచేయాలనే ఉత్సుకత, గౌరవం, ఆయన దర్శకత్వంపై ఉన్న నమ్మకంతో పనిచేశానని కార్తీ వ్యాఖ్యానించాడు. పైగా మణిరత్నం దర్శకత్వంలో నటించడం అంటే నటనలో మరిన్ని మెలకువలు నేర్చుకోవచ్చు అందుకే చెలియాలో నటించానని చెప్పుకొచ్చాడు. మణిరత్నంతో కలిసి పనిచేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశానని కార్తీ వెల్లడించాడు.