Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజనీకాంత్ "కాలా" ఇప్పట్లో విడుదల కాదు... ఎందుకో తెలుసా?

ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (12:04 IST)

Widgets Magazine
vishal

ప్రేక్షకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ సమ్మె చేపడుతున్నామని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ స్పష్టం చేశారు. మార్చి ఒకటో తేదీన నుంచి నిర్మాతల మండలి సమ్మె చేస్తోంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒక్కటంటే ఒక్క కొత్త చిత్రం కూడా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి పలు దఫాలుగా డిజిటల్‌ ప్రొవైడర్లు, థియేటర్‌ యజమానులతో చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలు ఆశాజనకంగా లేకపోవడంతో విశాల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ "చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ నిర్మాతకే తగులుతున్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారయ్యేంత వరకు కొత్త సినిమాలను విడుదల చేయం. మండలి చెబుతున్న డిమాండ్లన్నీ న్యాయమైనవే. అసలు తమ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయన్న విషయం కూడా తెలియడం లేదు. అందుకు థియేటర్‌ యజమానులే కారణం. అందువల్ల టికెట్ల విధానాన్ని కంప్యూటరీకరణ చేయాలి. అప్పుడే అన్ని వివరాలు పారదర్శకంగా ఉంటాయన్నారు.
 
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నదే నా అభిప్రాయం. దీనికి సంబంధించి ఈ నెల నాలుగో తేదీన చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లు కలిసి సచివాలయం దిశగా ర్యాలీ నిర్వహించనున్నాం. అనంతరం దీనికి సంబంధించి మంత్రి కడంబూర్‌ రాజుకు వినతిపత్రానికి అందజేస్తాం. సమ్మెతో కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. అయితే ఈ సమస్యలన్నీ పరిష్కారమైతే.. కార్మికులకు ఇంకా ఉపయోగార్థకంగా ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' కూడా ఈ సమస్యలన్నీ పూర్తయిన తర్వాతే విడుదలవుతుందని" అని స్పష్టం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'భరత్ అనే నేను'... ఐ డోంట్ నో అంటున్నాడు... (Audio Song)

ప్రిన్స్ మహేష్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". కైరా ...

news

పవన్ కల్యాణ్‌కు ఆ టాలెంట్ లేదులెండి?: మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంది. ...

news

ఆ డైరెక్టర్‌తో బాగా కనెక్టయిన సాయిపల్లవి...

తెలుగు సినీపరిశ్రమలో సాయిపల్లవి అంటే తెలియని వారుండరు. ఒకే ఒక్క సినిమాతో తానేంటో ...

news

శ్రీరెడ్డి లీక్స్.. ఈసారి అలీ షోస్ దర్శకుడు: ఆమె GREAT ANCHOR, BUSINESS RANI?

సుచీలీక్స్ తరహాలో శ్రీరెడ్డి లీక్స్ అంటూ మొన్నటికి మొన్న ఓ ఫోటోను పోస్టు చేసిన ...

Widgets Magazine