Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏ గాడిద కొడుకును వదిలిపెట్ట... లక్ష్మీపార్వతి శపథం

బుధవారం, 15 నవంబరు 2017 (08:28 IST)

Widgets Magazine
sr ntr - lakshmi parvathi

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 'ఏ గాడిద కొడుకును వదిలిపెట్ట'.. అంటూ ఆమె గర్జించారు. ముఖ్యంగా లక్ష్మీస్ వీరగ్రంథం (ఆదర్శగృహిణి) అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తీస్తున్న దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. 
 
తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు పక్కన తనకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టి సినిమా తీయడం, ఎన్టీఆర్‌ను అవమానించడమేనన్నారు. సినిమా నిర్మాతపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద షూటింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధిపై పాలు పోసి శుద్ధి చేశారు. 
 
మరోవైపు, ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమా షూటింగ్‌‌కు తొలిరోజే అడ్డంకి ఎదురైన విషయం తెల్సిందే. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ సినిమా షూటింగ్ ‌ చిత్రయూనిట్ ఆరంభించింది. అయితే చిత్రయూనిట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినిమా చిత్రీకరణకు అనుమతి లేదని వారు అభ్యంతరం తెలిపారు. దీంతో తాను అనుమతి తీసుకున్నానంటూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 
 
కాగా, అనుమతి పత్రంలో సినిమా పేరు, దానికి సంబంధించిన వివరాలు లేవంటూ షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మప్రబోధం మేరకు సినిమా తీస్తున్నామని అన్నారు. తమ సినిమాకు లక్ష్మీ పార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి, ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. తానేమీ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై లక్ష్మీ పార్వతికి అభ్యంతరం ఏంటని అడిగారు.
 
తాను 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను చంద్రబాబు కోణంలోంచి తీస్తున్నానని ఆయన చెప్పారు. తన సినిమా పూర్తయిన తరువాత, అది చూసిన తరువాత లక్ష్మీ పార్వతికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో చూసుకోవాలని సూచించారు. తాను కూడా కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన తెలిపారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఉత్తమ నటులు బాలయ్య - మహేష్ - ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. ఒకేసారి మూడు సంవత్సరాలకుగాను ఈ నంది ...

news

పవన్ భార్య అంటే ఫీలవ్వకుండా ఉండే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటా.. రేణు

పవన్ కళ్యాణ్‌తో దూరమైన తరువాత రేణుదేశాయ్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. పిల్లలున్న తాను ...

news

రేణూ దేశాయ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే రోజు..?

రేణూ దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత పాపులారిటీ వున్నదో అదేస్థాయిలో ఆయన మాజీ ...

news

వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్ (వీడియో)

బాలీవుడ్ వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ...

Widgets Magazine