Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్మ సినిమా వెనుక అసలు కథ ఇదే.. ఎవరున్నారంటే...?(వీడియో)

బుధవారం, 11 అక్టోబరు 2017 (15:56 IST)

Widgets Magazine

వర్మ ముందు పుట్టి కాంట్రవర్సీ తరువాత పుట్టిందనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఆయనేది పట్టుకున్నా.. ఏది ముట్టుకున్నా వివాదాస్పదమే. కాంట్రవర్సికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వర్మ మరో సంచలనానికి తెరతీయబోతున్నారు. చరిత్ర సృష్టించిన మహా నాయకుడు ఎన్‌టిఆర్ పైన వర్మ తీస్తున్న సినిమా తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇంతకీ వర్మ ఆ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నాడు.. దీనికి నిర్మాత ఎవరు.. ఈ సినిమా వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా..?
Lakshmis NTR
 
రక్తచరిత్ర తీసినా, బెజవాడ రౌడీలంటూ తీసిన అది వర్మకే చెల్లింది. సినిమా రిలీజ్ కంటే ముందే బోలెడంత పబ్లిసిటీని మూటగట్టుకునే వర్మ పబ్లిసిటీ కోసమే ఇలాంటి కాంట్రవర్సి సబ్జెక్టులను ఎంచుకుంటూ ఉంటాడు. అందులో భాగంగానే ఎన్‌టిఆర్ పైన సినిమా తీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటు సినిమా లైఫ్‌తో పాటు ఇటు పొలిటికల్ లైఫ్‌లోను రామారావు అనేక సంచలనాలకు తెరతీశారు. 
 
అగ్రహీ రోగా సుదీర్ఘ కాలం సినిమా పరిశ్రమను యేలడంతో పాటు రాజకీయంగా కూడా రాణించారు. అయితే ఆయన అవసాన దశలో అత్యంత క్షోభను ఎదుర్కొన్నాడు. ఈ విషయాల పట్ల అప్పట్లో ఏం జరిగిందన్నది ఇప్పటికీ చాలామందికి ఆసక్తికరమే. ఎవరికి వారుగా అనుకూలంగా అప్పటి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. 
 
కానీ అసలు విషయం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు అంతు చిక్కడం లేదు. ఇప్పుడు వర్మ ఈ విషయాన్నే బయటకు తీయబోతున్నాడా.. లక్ష్మీపార్వతి, రామారావుకి పరిచయం అవ్వడంతోనే మొదలైన కాంట్రవర్సిని వర్మ తన కాంట్రవర్సి సినిమాగా ఎంచుకున్నాడని చిత్రం టైటిల్‌ను చూస్తేనే అర్థమవుతుంది. అంటే వైశ్రాయ్ లాంటి సంఘటనలు ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటాయి.
 
అయితే ఎలాంటి వివాదాలకు దారితీస్తుందోనన్న భయం కూడా మరోవైపు ఉంది. ఇప్పటికే వర్మ సినిమాపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది. తమను తప్పుగా చూపిస్తే సహించేది లేదంటూ చంద్రబాబు అభిమానులు ఫైరవుతుంటే తన పరిచయాన్ని తప్పుగా చిత్రీకరిస్తే తాను కోర్టు వరకు వెళతానంటూ ఇదివరకే లక్ష్మీపార్వతి హెచ్చరించారు. వీరందరి హెచ్చరికల నేపథ్యంలో వర్మ ఈ సినిమాను ఎలా తీయబోతున్నాడన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. దానికి తోడు లక్ష్మీపార్వతి ఘట్టాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీస్తానన్న వర్మ మాటలు టిడిపిలో గుబులు రేపుతున్నాయి. 
 
ప్రస్తుతానికి లక్ష్మీపార్వతి వైసిపిలో ఉండడమే కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత కూడా వైసిపి నాయకుడే కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. వర్మ సినిమా వెనుక కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటన్నింటికి వర్మ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. తాను రాజకీయాల్లో లేనని అలాగని ఏ పార్టీకి మద్థతు తెలిపే వ్యక్తిని కూడా కాదని కేవలం సినిమాను సినిమాగానే చూస్తానని దీనిపై రాజకీయ రంగు పులమద్దంటున్నారు.
 
తమ సినిమా నిర్మాత రాకేష్‌ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడని, అందులోను వైసిపి నాయకుడన్న విషయం ముందు తనకు తెలియదన్నాడు. కేవలం ఒక ప్రొడ్యూసర్ గానే భావించి తనతో సినిమా తీయడానికి ఒప్పుకున్నానన్నాడు. సినిమా మొత్తం కూడా తన అభిరుచులకు అనుగుణంగా తన ఆలోచనలకు అనుగుణంగానే ఉంటుంది కాబట్టి దీనిపై ఎవరి ప్రభావం ఉండబోదంటున్నాడు వర్మ. ఇక వర్మ తీసే సినిమా సరిగ్గా ఎన్నికల కంటే కొన్నిరోజుల ముందు రిలీజ్ కాబోతుంది. దీంతో ఎలాంటి విషయాలు సినిమాలో ఉండబోతున్నాయి. అవి వచ్చే ఏపీ ఎన్నికల నాటికి ఎంతటి ప్రభావం చూపిస్తాయనడం కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. చూడాలి మరి సరికొత్త కాంట్రవర్సిని వర్మ ఏ విధంగా తెరపైకి తేబోతున్నాడో.. చూడండి వీడియోను..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్-2.. హోస్ట్‌గా నాగార్జున లేదా నాని.. పార్టిసిపెంట్స్‌గా చార్మీ, తరుణ్, లాస్య..

బిగ్ బాస్-1లో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా జరిగిన బిగ్ ...

news

'జబర్దస్త్' నుంచి రష్మీ ఔట్... హరితేజకు ఛాన్స్...

ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుంచి హాట్ యాంకర్ రష్మీ ...

news

జగపతిబాబు ఊర మాసా..? కాకా హోటల్లో ఏం చేశాడంటే?

విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం ...

news

నిజానికి మా పెళ్లి ఎప్పుడో జ‌రిగిపోయింది అంటున్న సమంత

టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు ఈనెల ఆరు, ఏడు తేదీల్లో ఓ ఇంటివారయ్యారు. తొలి రోజున ...

Widgets Magazine