బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (22:07 IST)

పవన్ కల్యాణ్ కోసం మాధవీలత మౌనదీక్ష-అరెస్ట్.. పోరాటం అంటే తిట్లే కాదు..(Video)

కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో పాటు పలు విధాలుగా పోరాటం చేస్తున్న తరుణంలో.. మరో హీరోయిన్ మాధవీలత కూడా జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు మౌనదీక్షకు దిగింది. శ్రీరెడ్డి పవన్ కల

కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో పాటు పలు విధాలుగా పోరాటం చేస్తున్న తరుణంలో.. మరో హీరోయిన్ మాధవీలత కూడా జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు మౌనదీక్షకు దిగింది. శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


అలాగే ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు సైతం శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మాధవీలత కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా మాధవీలత మౌన దీక్ష చేపట్టింది. మాధవీలతతో పాటు మరికొందరు పవన్ అభిమానులు దీక్షకు కూర్చున్నారు. 
 
పోరాటం అంటే తిట్లే కాదని.. మౌనంగా నిరసన చేద్దామని.. ''మౌనమే నా ఆయుధం'' అని రాసిన ప్లకార్డుతో మాధవీలత మౌన దీక్ష చేపట్టింది. అయితే శ్రీరెడ్డి అభిమానులు అక్కడికి రావడంతో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువైపుల నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె దీక్ష విరమించుకోలేదు. 
 
ఇలాంటి దీక్షలు చేసేటప్పుడు లోకల్ పరిధిలో ఉన్న పీఎస్ అనుమతి తీసుకోవాలని, అలాంటిదేమీ లేకుండా దీక్ష చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ... మాధవీలతను, ఆమెకు మద్దతుగా ఉన్నవారిని పోలీసులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌‌లోనే మౌన దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. చూడండి వీడియో...