Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీరెడ్డిపై జనసేన కార్యకర్తలు ఫైర్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. ఆ సింగర్లు ఏమన్నారంటే?

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (16:27 IST)

Widgets Magazine

పార్టీ అధినేత, అగ్రహీరో పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. శ్రీశక్తిపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. శ్రీరెడ్డిపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్‌పై, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు శ్రీశక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో జనసేన కార్యకర్తలు కోరారు. 
 
మరోవైపు శ్రీశక్తి కాస్టింగ్ కౌచ్‌పై చేస్తున్న పోరాటానికి మద్దతు లభిస్తోంది. కొందరు తారలు సినీ ఇండస్ట్రీలో తమకు ఏర్పడిన చేదు అనుభవాలను వెల్లగక్కుతున్నారు. ఈ క్రమంలో ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ కౌసల్య తన కెరీర్ గురించి అనే విషయాలను తెలియజేశారు. ఆర్పీ పట్నాయక్‌గారు వరుసగా మూడు సినిమాలకు తనతో పాడించారు. 
 
ఆ సమయంలో చక్రిగారు బాచీ సినిమా కోసం పిలిపించి, ''చిత్రం'' సినిమాలో ''ఏకాంతవేళ..'' పాడిన అమ్మాయినని దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు పరిచయం చేశారు. ఇక టెస్టులెందుకని.. పాడించేయ్ అంటూ పూరీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ చిత్రంలో రెండు పాటలు పాడానని చెప్పుకొచ్చింది. తర్వాత చక్రి సినిమాల్లోనే పాడుతూ వచ్చాను. కానీ చనిపోయేందుకు నాలుగైదు సంవత్సరాల ముందు ఆయన కూడా తనకు ఛాన్సులు ఇవ్వలేదని.. కారణం ఏమిటంటే.. వరుసగా చక్రి సినిమాలకు పాడటం ప్లస్ కాదు మైనస్ కూడా అవుతుందన్నారు. తనతో టర్మ్స్ బాగాలోని వాళ్లు నిన్ను పిలవరని చక్రి చెప్పేవారని కౌసల్య తెలిపింది. 
 
అలాగే ఆలీతో సరదాగాలో సింగర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మొహమాటం ఎక్కువ కావడంతో అవకాశాలను ఎవరి వద్ద అడగలేదని చెప్పింది. అవకాశాల కోసం అడగలేదని.. అహంభావం అనుకుంటారని.. నిజానికి కారణం అది కాదని చెప్పింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేసీఆర్ సర్కారుకు షాక్ ... ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ...

news

జూన్ 2 నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ...

news

మసాజ్ పేరిట వ్యభిచారం... ముగ్గురమ్మాయిలు.. ఇద్దరు విటులు

హైదరాబాద్‌లోని నాచారంలో మసాజ్ పేరిట వ్యభిచారం సాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ...

news

బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ హరిబాబు ఎందుకు రిజైన్ చేశారంటే...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ...

Widgets Magazine