Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''కాలా''కు సినిమాతో రజనీకాంత్, ధనుష్‌కు కొత్త చిక్కు

గురువారం, 25 జనవరి 2018 (10:03 IST)

Widgets Magazine

''కాలా'' సినిమా కథ, టైటిల్ కాపీ అంటూ ఓ సహాయ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్, నిర్మాత, దర్శకుడు ఫిబ్రవరి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. సినిమా టైటిల్‌తో పాటు కథ తనదేనంటూ సహాయ దర్శకుడు రాజశేఖరన్ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు విచారించింది.
 
'కాలా కరికాలన్' అనే కథను పదేళ్ల క్రితం తాను రాసుకున్నానని, అందులో రజనీకాంత్‌ను హీరోగా తీసుకోవాలని భావించానని.. పిటిషనర్ వాదనను న్యాయస్థానం విన్నది. ఈ క్రమంలో 'కాలా' పాత్రధారి రజనీకాంత్, నిర్మాత ధనుష్‌, దర్శకుడు పా రంజిత్‌, దక్షిణ చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘంకు నోటీసులు పంపింది. 
 
కాగా, ''కాలా'' సినిమాపై 2017 అక్టోబర్‌లో చెన్నై కోర్టును రాజశేఖరన్ ఆశ్రయించగా, అక్కడ విచారణ సందర్భంగా తమ సినిమా కథ పా రంజిత్‌ రాసినదని, పిటిషనర్ కథతో సంబంధం లేదని ధనుష్‌ ప్రొడక్షన్‌ సంస్థ వండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ వివరణ ఇచ్చింది. 
 
ఆపై ఈ పిటిషన్‌ను హైకోర్టుకు తీసుకెళ్లమని సూచించడంతో పిటిషనర్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, దానిని స్వీకరించిన న్యాయస్థానం రజనీ, నిర్మాత, దర్శకుడ్ని ఫిబ్రవరి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajinikanth Dhanush Ranjith Gangster Kaala Madras High Court

Loading comments ...

తెలుగు సినిమా

news

బాబాయ్ రాజకీయాల్లో మీరే బెస్ట్... ఎవరు?(Pawan Kalyan Video)

ప్రస్తుత రాజకీయాల్లో సినీ ప్రముఖులే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే కొంతమంది ...

news

'భాగమతి' కోసం కేర‌ళ ప్రమోష‌న్‌లో అనుష్క‌(Video)

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్‌తో స‌హా అన్ని ప్ర‌మోష‌న‌ల్ ...

news

మోహన్ బాబుకు జోడీగా హాట్ యాంకర్ అనసూయ..

వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధం అంటోంది అనసూయ. ఇప్పటికే ...

news

రాజకీయాల్లో రజనీ, పవన్ రాణిస్తారు: రానా కామెంట్

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ రాజకీయ బరిలోకి దిగనున్నారు. ...

Widgets Magazine