మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (17:16 IST)

మహేష్ బాబును బెదిరించినా లేక 200 కోట్లు ఇచ్చినా నమ్మందే ఏది చెయ్యడు

Sudhir Babu
సుధీర్ బాబు,ఆనంది హీరో హీరోయిన్లుగా `పలాస 1978` ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం "శ్రీదేవి సోడా సెంటర్". ప్రపంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 27 న విడుద‌లైన ఈ చిత్రం థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా శనివారం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేవారు.
 
నా చరిత్రను మార్చేసింది
సీనియర్ నరేశ్ మాట్లాడుతూ, సెకెండ్ లాక్ డౌన్ తరువాత  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా "శ్రీదేవి సోడా సెంటర్". దర్శకుడు కరుణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. పలాస సినిమా తీయడమే చాలా కష్టం. అలాంటిది ఈ సినిమాను ఎంతో కష్టపడి చాలా డెడికేటెడ్ గా అద్భుతంగా తీశాడు. నాతో పాటు ఈ చిత్రంలో నటించిన వారంతా చాలా చక్కగా నటించారు. ఇప్పటి వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. నా సినిమా చరిత్రను ఈ క్యారెక్టర్ మార్చేసింది. నా జీవితంలో గుర్తుండి పోయే పాత్రలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. చిత్ర నిర్మాతలు కంటెంట్ బేస్డ్ సినిమాలు సెలెక్ట్ చేసుకొని నిర్మించారు. వీరిని చూస్తుంటే వీరిలో నాకు ద గ్రేట్ రామానాయుడు కనిపించాడు. వీరు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కుటుంబమంతా కలసి తప్పక చూడవలసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అన్నారు.
 
నచ్చితే పది మందికి తెలియ జేయండి
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ, ఇది రెగ్యులర్ సినిమా కాదని ఎన్నో సార్లు చెప్పాను. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి సూరిబాబు, శ్రీదేవి పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. సినిమా బాగుందని అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్, ప్రశాంత్ నీల్, రానా, నిహారిక కొణిదెల సినిమా బాగుందని ట్వీట్ చేశారు. మహేష్ బాబు అనే వ్యక్తిని బెదిరించినా లేక 200 కోట్లు ఇచ్చినా కూడా తన కెరియర్ లో తను నమ్మందే ఏది చెయ్యడు. ఈ సినిమా కు తను పంపిన ట్వీట్ లో ఎవరెవరు ఎం చేశారు అనేది క్లియర్ గా చెప్పాడు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. నచ్చితే పది మందికి తెలియ జేయండి. ఫ్యామిలీ అందరూ కలసి వచ్చి చూడవలసిన ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
 
Sridevi Soda Center Success Meet
చిత్ర నిర్మాతలు శశి,విజయ్ లు మాట్లాడుతూ, మంచి కంటెంట్ తో తీసిన మా సినిమా కు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా రివ్యూస్ చూసి మహేష్, రానా, ప్రశాంత్ నీల్ వంటి సినిపెద్దలు సినిమా బాగుందని ట్వీట్ చేస్తున్నారు. సినిమాలోని ఫస్ట్ బోట్ రేస్ చూసిన వారంతా కూడా హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉందని ప్రశంశిస్తున్నారు.. ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తున్న కారణంగా ఈ రోజు నుండి మేము మరిన్ని థియేటర్స్ పెంచుతున్నాము. ఇంతమంచి పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపారు..
 
చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ, శ్రీదేవి సోడా సెంటర్ టైటిల్ ఒప్పుకోవడం సుదీర్ బాబు చాలా గ్రేట్. తల్లిని, భార్యను స్త్రీలను గౌరవించే వాళ్ళు మాత్రమే ఇలాంటి లేడీ ఓరియంటెడ్ టైటిల్ ను ఒప్పుకుంటారు. అందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు అలాగే మేము ఎంత గొప్ప సినిమా తీసిన ప్రేక్షకులకు నచ్చక పోతే చూడరు. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా బాగుందని మహేష్, రానా, ప్రశాంత్ నీల్ మొదలగు చాలా మంది ఆఫ్రిసియేట్ చేశారు..యూనిట్ అంతా చాలా కష్టపడి నటించారు. యూత్ అందరికీ నచ్చే సినిమా. మంచి కంటెంట్ తో తీసిన ఈ సినిమాను మహిళలు అందరూ వచ్చి తప్పక చూడవలసిన సినిమా ఇది. మా చిత్రంలో శ్రీ పాత్రలో నటించిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనాలు అన్నారు.
 
నటి కల్యాణి రాజ్‌ మాట్లాడుతూ, చాలా సినిమాల్లో లేడీస్ క్యారెక్టర్స్ వచ్చి పోయినట్లు ఈ సినిమాలో నా క్యారెక్టర్ వుండదు.ఎప్పటికీ గుర్తుండి పోయే మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు ఆన్నారు. నటి రోహిణి మాట్లాడుతూ, కరుణ సర్ ఈ సినిమాను చాలా బాగా తీశారు. హీరో,హీరోయిన్స్ లవ్, ఎమోషన్స్ లలో చాలా అద్భుతంగా నటించారు.ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.