Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మలయాళ సూపర్ స్టార్ హీరోగా మహానేత "వైఎస్ఆర్ బయోపిక్"

మంగళవారం, 2 జనవరి 2018 (12:04 IST)

Widgets Magazine
ysr - Mammootty

చిత్రసీమలో బయోపిక్‌ల కాలంనడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు బయోపిక్‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు సూపర్ హిట్ ఖాతాలో చేరాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రముఖుల జీవిత చరిత్రలు ఆధారంగా పలు చిత్రాలు నిర్మితంకానున్నాయి. ఈ కోవలో మహానటి సావిత్రి, స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్రల ఆధారంగా రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' పేరుతో ఓ చిత్రాన్ని తీస్తున్నారు. 
 
ఇపుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. ఇందులో రాజశేఖర్‌ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు టాలీవుడ్‌ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌.. నటుడు రాజశేఖర్‌తో కలిసి వైఎస్సార్‌ బయోపిక్‌ తీయాలని భావించారు.
 
కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు 'ఆనందో బ్రహ్మ' వంటి బ్లాక్‌‌బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి.రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నారు. ఇందుకు వైఎస్సార్‌ కుమారుడు, వైకాపా అధినేత జగన్‌ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలో బయోపిక్‌కు సంబంధించిన వివరాలను రాఘవ్‌ అధికారికంగా వెల్లడించనున్నారట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వెబ్ సిరీస్ పేరుతో నగ్నగా సినిమా తీశారు : సినీ నటి ఫిర్యాదు

వెబ్‌ సిరీస్ పేరుతో నగ్నం(బ్లూ ఫిల్మ్)గా తీశారంటూ ఓ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ...

news

బాలీవుడ్ సినిమాలో డార్లింగ్.. మూడేళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్

బాహుబలి హీరో ప్రభాస్‌కు యమా క్రేజ్ వుంది. బాహుబలికి ధీటుగా ప్రభాస్ ఇమేజ్‌ను ...

news

'అజ్ఞాతవాసి'ని చూడనున్న మెగా ఫ్యామిలీ .. 8న స్పెషల్ స్క్రీనింగ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ ...

news

రండి.. చేతులు కలపండి... రజనీ పిలుపు : వెబ్‌సైట్ లాంచ్

తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ...

Widgets Magazine