సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (13:55 IST)

ఎమ్మెల్యే కుమార్తెతో సినీ దర్శకుడి వివాహం... ఎక్కడ?

ఓ ఎమ్మెల్యే కుమార్తెతో ఓ సినీ దర్శకుడి వివాహం గుడిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్‌ కుమార్తె లక్ష్మి, కన్నడ "మాస్తిగుడి"

ఓ ఎమ్మెల్యే కుమార్తెతో ఓ సినీ దర్శకుడి వివాహం గుడిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్‌ కుమార్తె లక్ష్మి, కన్నడ "మాస్తిగుడి" చిత్ర నిర్మాత, దర్శకుడు పి.సుందర్‌ గౌడలు సినిమా స్టైల్‌లో ప్రేమించుకున్నారు. అయితే, వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ లేచిపోయి గురువారం మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 
 
కాగా, బుధవారమే ఎమ్మెల్యే శివమూర్తి తన కుమార్తె కనిపించట్లేదని బెంగళూరు యలహంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మైసూర్‌లో ఉందని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లేలోపే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఎమ్మెల్యే కుమార్తె లక్ష్మీ స్పందిస్తూ, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఈ పెళ్ళి తన ఇష్ట ప్రకారమే జరిగింది. ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదు. మా వల్ల ఎవరికి ఇబ్బంది కలదు.. అలాగే, మాకూ కల్పించవద్దని ఓ వీడియోను ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.