మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (13:24 IST)

నానికి వదిన.. నాగచైతన్యకు అక్కగా ఎవరు?

ఖుషీ హీరోయిన్ భూమిక ప్రస్తుతం టాలీవుడ్‌‍లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అలరించిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒదిగిపోదామనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేచు

ఖుషీ హీరోయిన్ భూమిక ప్రస్తుతం టాలీవుడ్‌‍లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అలరించిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒదిగిపోదామనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేచురల్ స్టార్ నానికి వదినగా ఎంసీఏలో కనిపించింది. తాజాగా భూమిక నాగచైతన్యకు అక్కగా నటించనుంది. ''సవ్యసాచి''గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మాధవన్ కూడా నటిస్తున్నాడు. 
 
కథ ప్రకారం మాధవన్, భూమిక జోడీగా నటిస్తారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయని టాక్ వస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో చైతూ హీరోగా నటిస్తుండగా, హీరోకు అక్కగా భూమిక నటించనుంది. ఈ సందర్భంగా తన వయస్సుకు తగిన రోల్స్ వచ్చే చేస్తానని.. ఇందులో ఇబ్బంది పడే ప్రసక్తే వుండదని.. భూమిక తెలిపింది. ఇక చైతూకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది.