శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 17 జులై 2018 (10:22 IST)

ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో న‌టిస్తోన్న విద్యాబాల‌న్ ఏం చేసిందో తెలుసా..?

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య ఎన్టీఆర్‌గా న‌టిస్తుంటే... బాలీవుడ్ భామ విద్యాబాల‌న్ ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కంగా న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ అత్యంత ప్ర‌తిష్టాత‌క్మంగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. విద్యాబాల‌న్ జాతీయ ఉత్తమ నటి పురస్కారం క

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య ఎన్టీఆర్‌గా న‌టిస్తుంటే... బాలీవుడ్ భామ విద్యాబాల‌న్ ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కంగా న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ అత్యంత ప్ర‌తిష్టాత‌క్మంగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. విద్యాబాల‌న్ జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్నారు. ఆమె ప్రత్యేకత ఏమిటంటే.. ఏ పాత్ర చేసినా అందులో లీనమై న‌టించ‌డం. ఈ సినిమాలో న‌టించేందుకు విద్యాబాల‌న్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.
 
ఈ పాత్ర‌లో న‌టించేందుకు ఆమె తను చేస్తున్న పాత్ర తీరుతెన్నుల గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. సొంతంగా పరిశోధనే చేస్తుంది. అందుకే బసవతారకం వ్యక్తిగత అభిరుచులు, అలవాట్లు గురించి విద్య తెలుసుకోవడం ప్రారంభించిందట. దీని కోసం ఆమె నందమూరి కుటుంబ సభ్యులను కలిసినట్టుగా... బసవతారకం గురించి ఆమె కూతుళ్లను, కొడుకులను అడిగి తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. ఇందుకోసం నందమూరి కుటుంబ సభ్యులను వరుసబెట్టి కలుస్తోందట. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తుందట.
 
ఇకపోతే రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.