''పద్మావత్'' కలెక్షన్ల సునామీ.. రూ.231 కోట్ల నెట్‌తో అదుర్స్
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ''పద్మావత్'' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం భారత్‌లో
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ''పద్మావత్'' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం భారత్‌లో రూ.231 కోట్ల నెట్‌ను రాబట్టింది. తద్వారా 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాగా పద్మావత్ నిలిచింది.
దీపికా పదుకునే సినిమా భారీ వసూళ్లను కైవసం చేసుకున్న తరహాలో ఏ ఫీమేల్ లీడ్ సినిమా వసూళ్లను సాధించలేదు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది.
ఇకపోతే.. పద్మావత్ సినిమాపై బీజేపీ ఎంపీ, సీనియర్ నేత శత్రుఘ్ను సిన్హా ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని.. దీపిక పదుకునే నటన ఆకట్టుకుంటుందని తెలిపారు.
అలాగే ఈ సినిమా నిలుపుదల కోసం కర్ణిసేన చేసిన ఆందోళనను అభినందించారు. పద్మావత్ పాత్ర రాజ్‌పుత్ మహిళ వంశపారపర్యాన్ని ప్రతిబించేదిగా.. వారిని గౌరవాన్ని నిలబెట్టేదిగా వుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ధైర్యం చేసి ఈ చిత్రాన్ని రూపొందించారని శత్రుఘ్ను సిన్హా కొనియాడారు.