Widgets Magazine

వర్మ ''జీఎస్టీ'' కలెక్షన్లను కుమ్మేస్తోందట.. ఇప్పటికే రూ.11కోట్లు?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ''జీఎస్టీ'' అనే షార్ట్ ఫిలిమ్‌తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 19 నిమిషాల నిడివి గల ఈ సినిమాను వర్మ రిపబ్లిక్ డే రోజున విడుదల చేశాడు. ఈ చిత్రం ఆన్‌లైన్

selvi| Last Updated: బుధవారం, 31 జనవరి 2018 (13:23 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ''జీఎస్టీ'' అనే షార్ట్ ఫిలిమ్‌తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 19 నిమిషాల నిడివి గల ఈ సినిమాను వర్మ రిపబ్లిక్ డే రోజున విడుదల చేశాడు. ఈ చిత్రం ఆన్‌లైన్‌లో రిలీజైంది. ఈ చిత్రాన్ని రూ.150 చెల్లించి వీక్షించేందుకు భారీ సంఖ్యల్లో ఎగబడ్డారు. ఇలా భారీగా జనాలు సైట్లోకి రావడంతో సైట్ కాస్త మొరాయించింది.

తాజాగా ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. ఆన్‌లైన్ ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించే వారి సంఖ్య అధికంగా వుంది. ఫలితంగా రూ.11 కోట్ల మేర వసూళ్లను జీఎస్టీ రాబట్టిందని టాక్ వస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.60లక్షలకు పైగా వర్మ టీమ్ ఖర్చు పెడితే.. అందులో ఎక్కువ భాగం మియా మాల్కోవాకే ఇచ్చారు. అందులో కొంత సంగీతం సమకూర్చిన కీరవాణికి ఇచ్చారు. అయితే కలెక్షన్లు మాత్రం కోట్లలో వస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


దీనిపై మరింత చదవండి :