Widgets Magazine

రోబో 2.0 టీజర్ వేడుకకు మమ్ముట్టి, మెగాస్టార్, మోహన్ లాల్

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (13:38 IST)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమాను ఆగస్టు 15 తర్వాత విడుదల చేయనున్నారు. స్టార్ హీరోలు రజనీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ఈ చిత్రంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ను పొందుపరిచారు. ఈ పనులు ఇంకా పూర్తికాకపోవడంతోనే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోందని సినీ యూనిట్ వర్గాల సమాచారం. ఇందులో మొత్తం 11వేల వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం శంకర్ 2.0 సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ పనులు పూర్తయ్యాక విడుదలపై కచ్చితమైన తేదీని ప్రకటిస్తారు. ఇక ఆడియో వేడుక కార్యక్రమాన్ని దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వహించిన ఈ సినీ యూనిట్.. త్వరలోనే హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ టీజర్‌తో భారీగా అంచనాలు పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. 
 
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, అలాగే మలయాళ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మాసాంతంలో రజనీకాంత్ రోబో 2 టీజర్ వేడుకకు భాగ్యనగరం వేదిక కానుందని తెలిసింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ.. అల్లు అర్జున్ పాత్ర ఎలా వుంటుంది?

బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా మాస్ ...

news

తెరాస తరపున పోటీ చేయనున్న సమంత?

అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో ...

news

హీరో అఖిల్ మాజీ ప్రియురాలికి రాంచరణ్ భార్య బంధువుతో వివాహం?

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో ...

news

'కాజల్ అక్కా ఐ లవ్ యూ' అన్న అభిమాని... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ...

Widgets Magazine