శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (13:42 IST)

నా ఫోన్ నెంబర్‌ని సన్నీలియోన్ పోర్న్‌ ఇండస్ట్రీ వారికిచ్చింది: రాఖీసావంత్

పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌పై హాట్ సుందరి రాఖీసావంత్ సంచలన కామెంట్స్ చేసింది. తన ఫోన్ నెంబర్‌ను సన్నీలియోన్ పోర్న్ పరిశ్రమకు చెందిన వారికి ఇచ్చిందని రాఖీ ఆరోపణలు చేసింది. సన్నీ తన ఫోన్

పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌పై హాట్ సుందరి రాఖీసావంత్ సంచలన కామెంట్స్ చేసింది. తన ఫోన్ నెంబర్‌ను సన్నీలియోన్ పోర్న్ పరిశ్రమకు చెందిన వారికి ఇచ్చిందని రాఖీ ఆరోపణలు చేసింది. సన్నీ తన ఫోన్ నెంబర్ ఇవ్వడంతో.. ఆ పరిశ్రమకు చెందిన వారి నుంచి తనకు కాల్స్ కూడా వస్తున్నాయని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. 
 
ఆ ఫోన్ కాల్స్ అన్నీ తనను నీలిచిత్రాల్లో నటించమని ఆఫర్ చేస్తున్నాయని రాఖీ చెప్పింది. ఇంకా భారీ పారితోషికం కూడా ఇస్తామని కోరుతున్నారని రాఖీ సావంత్ తెలిపింది. అయితే తాను చచ్చినా అలాంటి చిత్రాల్లో నటించనని రాఖీ స్పష్టం చేసింది. ఎందుకంటే తాను భారతీయ స్త్రీనని.. తనకూ కొన్ని విలువలు వున్నాయని రాఖీ చెప్పింది. 
 
ఇటీవల సన్నీ దంపతులు సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఇందుకు తాను శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియోను పోస్టు చేశాను. ఆ సమయంలో సన్నీ తనకు ఫోన్ చేసిందని.. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ చేసి..'నన్ను చూసి కుళ్లుకుంటున్నావా?' అని అడిగినట్లు రాఖీ వెల్లడించింది.

సన్నీ అలా ఎందుకు అడిగిందో తెలియదని.. ఆమెను చూసి తానెందుకు ఈర్ష్య చెందుతానని బదులిచ్చింది. అయితే రాఖీ చేసిన వ్యాఖ్యలపై సన్నీలియోన్ నోరు విప్పలేదు.