Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'దిల్ రాజు'కే ఝలక్ ఇచ్చిన సాయిపల్లవి

గురువారం, 18 జనవరి 2018 (16:47 IST)

Widgets Magazine
sai pallavi

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో 'దిల్' రాజు ఒకరు. గత యేడాది ఏ నిర్మాత కూడా తీయనన్ని చిత్రాలను దిల్ రాజు నిర్మించారు. ఈ ఆరు చిత్రాలూ సూపర్ డూపర్ హిట్లే. ఇందులో 'ఫిదా', 'ఎం.సి.ఏ' చిత్రాల్లో సాయి పల్లవి హీరోయిన్. అలాంటి సాయి పల్లవి ఇపుడు దిల్ రాజుకు తేరుకోలేని షాక్ ఇచ్చిందట. 
 
ప్రస్తుతం రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దాగుడుమూతలు' అనే మల్టీ స్టారర్ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో కథానాయకులుగా శర్వానంద్ - నితిన్‌లను ఎంపిక చేసుకున్నారు. ఇక కథానాయికలుగా రకుల్ - సాయిపల్లవిలను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే సాయిపల్లవి ఈ సినిమా చేయడం లేదనేది తాజా సమాచారం.
 
తన కోసం అని చెప్పిన పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా తాను చేయలేనని సాయిపల్లవి తెగేసి చెప్పేసిందట. దాంతో దిల్ రాజు - హరీష్ శంకర్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. నితిన్‌తో దిల్ రాజు చేయనున్న 'శ్రీనివాస కల్యాణం' సినిమాలోనూ సాయిపల్లవిని అనుకోవడం.. ఆమె నో చెప్పడం తెలిసిందే. ఇపుడు మరోమారు సాయి పల్లవి నో చెప్పడం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వీడి దుంపతెగ... 72 ఏళ్ల బాలీవుడ్ హీరో 4వ పెళ్లి... తనకన్నా 29 ఏళ్ల చిన్నది

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు మామూలే. ఐతే వయసు తేడాతో పెళ్లిళ్లు ...

news

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేదట... మరి డార్లింగా? అనుష్క ఏమంటోంది?

"బాహబలి" చిత్రం కోసం ఐదేళ్ల పాటు కలిసి పని చేసిన హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల మధ్య ...

news

‘మందార మందార.. కరిగే తెల్లారా’ అంటున్న భాగమతి (సాంగ్ వీడియో)

'బాహుబలి' తర్వాత అనుష్క చేస్తున్న సినిమా 'భాగమతి'. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ...

news

తమిళ్ - తెలుగు ప్రజల గొడవల నేపథ్యంగా ఛలో (ట్రైలర్)

యువ హీరో నాగశౌర్య వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఛలో ...

Widgets Magazine