మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (20:18 IST)

రామేశ్వరంలో శ్రీదేవి అస్థికలు కలుపనున్న బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం చెన్నై చేరుకుని.. అక్కడి నుంచి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు రామేశ

అతిలోక సుందరి శ్రీదేవి.. అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు ఆమె కుటుంబీకులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం చెన్నై చేరుకుని.. అక్కడి నుంచి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు రామేశ్వరం వెళ్తారని సమాచారం. రామేశ్వరంలో అస్థికలు నిమజ్జనం చేసిన తర్వాత తిరిగి ముంబై చేరుకుంటారని తెలిసింది. 
 
కాగా దుబాయ్‌కి మేనల్లుడి పెళ్లి కోసం వెళ్లి.. బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు ఊపిరాడక ఫిబ్రవరి 24న శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు ఫిబ్రవరి 28వ తేదీన ముంబైలో జరిగాయి. ఇదిలా ఉంటే.. శ్రీదేవి మృతి చెందడాన్ని ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి హఠాన్మరణం చెందడంతో అందరూ షాక్‌లో వున్నారు. 
 
సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ శ్రీదేవి అభిమాని రైలులో ''చాందినీ'' లోని ''తేరే మేరే హోనోథో పర్ ..'' పాటను వాయిస్తూ తన అభిమాన నటికి నివాళులర్పించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.