Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోలీవుడ్‌లో కలకలం.. కె.బాలంచదర్ ఆస్తుల వేలం?

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:24 IST)

Widgets Magazine
k.balachander

తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం వేయనున్నారన్నది ఆ వార్త. దీనికి సంబంధించి ఓ బ్యాంకు నోటీసు కూడా జారీచేసింది. ఈ నోటీసు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. 
 
బాలచందర్‌కు చెందిన కవితాలయా సంస్థ పలు టీవీ సీరియల్స్ నిర్మించింది. వీటిలో కొన్ని మంచి ప్రజాదారణ పొందగా, మరికొన్ని నష్టాలను తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ ఆయన సీరియల్స్ తీయడం మానలేదు. ఈ నేపథ్యంలో కవితాలయ నిర్మించిన ఓ టీవీ సీరియల్ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారు. 
 
2015లో సీరియల్ నిర్మాణ పనులను రద్దు చేసి, డిజిటల్ నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి వరకు బ్యాంకు రుణంపై అసలుతో పాటు కొంతమేర వడ్డీని చెల్లిస్తూ వచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి చర్యలు తీసుకున్నారు. ఇంతలోనే యూకో బ్యాంకు బాలచందర్ ఆస్తులను వేల వేయనున్నట్టు నోటీసు పంపించింది. ఈ వార్త వేలాదిమంది బాలచందర్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే... (Video)

టాలీవుడ్ హీరో విశాల్ తాజా తమిళ చిత్రం "ఇరుంబుతిరై". విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ ...

news

పవన్ బాటలో కమల్ హాసన్.. సినిమాలొద్దు.. రాజకీయాలే ముద్దు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో సినీ లెజెండ్ కమల్ హాసన్ కూడా ప్రయాణిస్తున్నట్లు ...

news

తేజ సినిమా శ్రియ.. సీనియర్ హీరోకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..

తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమాలో హీరోయిన్ దొరకడం కష్టమైపోయింది. తమన్నా, కాజల్ ...

news

నేను కూడా ప్రేమ బాధితుడినే: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి'' సినిమాలో ప్రేమ కోసం హీరో విజయ్ దేవరకొండ చేసిన నటన అంతా ఇంతా కాదు. ...

Widgets Magazine