శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (10:56 IST)

బర్త్‌డే గిఫ్ట్ : త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్

తెలుగు చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఆయన బుధవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఆయనకు ఓ బర్త్‌డే గిఫ్ట్ లభించింది.

తెలుగు చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఆయన బుధవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఆయనకు ఓ బర్త్‌డే గిఫ్ట్ లభించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నారు.
 
ఈ సందర్భంగా హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ ఓ అధికారిక ప్రకటన చేశారు. త్రివిక్రమ్ - వెంకటేశ్ కాంబినేషన్‌లో తమ సినిమా ఉంటుందని ప్రకటించారు. వెంకటేశ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 
 
రచయితగా త్రివిక్రమ్ 'నువ్ నాకు నచ్చావ్' .. 'మల్లీశ్వరి' వంటి హిట్ సినిమాలకి వెంకటేశ్‌తో కలిసి పనిచేశారు. మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమాకి పనిచేయనుండటం విశేషం. ప్రస్తుతం పవన్‌తో 'అజ్ఞాతవాసి' చేస్తోన్న త్రివిక్రమ్ ఆ తర్వాత సినిమాను ఎన్టీఆర్‌తో చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తారు.