శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (11:06 IST)

శ్రీదేవి దేశానికి ఏం చేశారనీ... త్రివర్ణపతాకం ఉంచారు : రాజ్‌థాక్రే

సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర

సినీ నటి శ్రీదేవి అంతిమయాత్రలో ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా ఉంచడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ పార్టీ అధినేత రాజ్ థాక్రే తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఆమె దేశానికి ఏం చేశారనీ, ఆమె భౌతికకాయంపై ఎందుకు త్రివర్ణ పతాకం ఉంచారనీ ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆమె భౌతికకాయంపై త్రివర్ణపతాకం ఎందుకు ఉంచారు. అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ అంశంపై బీజేపీ రాద్దాంతం చేసేది. మీడియా సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవటం విడ్డూరంగా ఉంది. శ్రీదేవి గొప్పనటిగా అందరికీ అభిమానం ఉందనీ, కానీ, దేశానికి ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని రాజ్‌థాక్రే ప్రశ్నించారు.