ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (18:00 IST)

చేతినిండా సంపాదిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. కోటి డీల్?

ప్రేమికుల రోజు సందర్భంగా.. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ సెలెబ్రిటీ ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రస్తుతం సినీ అవకాశాలు వెల్లువల్లావస్తున్నాయి. అలాగే వాణిజ్య ప్రకటనలు కూడా

ప్రేమికుల రోజు సందర్భంగా.. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ సెలెబ్రిటీ ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రస్తుతం సినీ అవకాశాలు వెల్లువల్లావస్తున్నాయి. అలాగే వాణిజ్య ప్రకటనలు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల ఓ చాక్లెట్ యాడ్ కోసం కన్నుగీటిన ప్రియా ప్రకాష్ వారియర్‌కు మరో యాడ్ వరించిందట. 
 
మలయాళ సినిమా ''ఒరు అదార్‌ లవ్‌''లోని ఓ పాటలో కన్నుగీటుతూ విపరీత పాప్యులారిటీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఓ వాణిజ్య ప్రకటన కోసం రూ.కోటి డీల్‌కు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. ఆ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. 
 
అంతేగాకుండా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్లు ఆరు మిలియన్లకు పైగా పెరిగిపోవడం ద్వారా ప్రియా వారియర్ చేతినిండా సంపాదిస్తోంది.  అందులో ఆమె ఇచ్చే ఒక్కో ప్రకటనకు రూ.8 లక్షలు తీసుకుంటోంది. ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోటి రూపాయల భారీ డీల్ ద్వారా ఎంత పాపులారిటీ వస్తుందో వేచి చూడాలి మరి.